Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం నేటితో దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న రాశీ ఖన్నా(Rashi Khanna) పార్ట్ కి సంబంధించిన షూటింగ్ నేటితో పూర్తి అయ్యిందట. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ రోజుతో నాకు సంబంధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పుడు 2025 ముగింపుకి ఒక అర్థం దొరికింది. ఈ సినిమా షూటింగ్ ప్రయాణం లో పరిచయమైనా వ్యక్తుల ద్వారా నేను నేర్చుకున్న పాఠాలకు కృతజ్ఞురాలిని’ అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. అంతే కాకుండా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆమె అప్లోడ్ చేసింది.
ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు అనే విషయం తెలిసిన వెంటనే అభిమానులు కాస్త కంగారు పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల, ఆయన లుక్స్ పై శ్రద్ద తీసుకోవడం లేదు. ఇలాంటి సమయం లో అంతటి యంగ్ హీరోయిన్స్ ని పెడితే ఆడియన్స్ బాగా ట్రోల్ చేస్తారేమో అని భయపడ్డారు. కానీ మొన్న విడుదల చేసిన ‘దేఖ్లేంగే సాలా’ పాటలో కానీ, నేడు విడుదల చేసిన ఫోటోలలో కానీ పవన్ కళ్యాణ్ లుక్స్ ఈ ఇద్దరి హీరోయిన్స్ పక్కన చూస్తే , వాళ్ళకంటే ఈయనే యంగ్ గా కనిపిస్తున్నాడు. కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 29 తో ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తోంది.
అయితే ఈరోజు రాశీ ఖన్నా అప్లోడ్ చేసిన ఫోటోలలో బ్యాక్ గ్రౌండ్ ని పరిశీలిస్తే ఎదో అటవీ ప్రాంతం లో ఈ సినిమాని షూట్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కాబట్టి, అడవి నేపథ్యం లో ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేస్తున్నారా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇక రాశీ ఖన్నా మెడలో కెమెరా ని చూస్తుంటే, ఆమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అని తెలుస్తోంది. ఈ సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీసి ఉంటే కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ఇకపోతే రాశీ ఖన్నా కి సంబంధించిన సన్నివేశాలు మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే వస్తాయట. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యి మూడు నెలలు కావొస్తుంది. జనవరి నుండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టి మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.