Chiranjeevi And Srikanth Oodela Project: మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్ లో ఒకటి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela ) తో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేయబోతున్న చిత్రం. గత ఏడాది డిసెంబర్ నెల లో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాగా, సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రానికి కూడా శ్రీకాంత్ ఓదెల నే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాని హీరో గా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 26 న విడుదల కాబోతుంది . ‘దసరా’ వంటి భారీ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల తీస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇక అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి తో పని చేస్తే ఇక ఎలాంటి క్రేజ్, అంచనాలు ఉంటాయో మీరే ఊహించుకోండి. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది . వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జులై నెల నుండి మొదలు కాబోతున్నట్టు సమాచారం. ‘ది ప్యారడైజ్’ చిత్రం జనవరి నెలాఖరు లోపు పూర్తి అవుతుందని, మార్చ్ 26 న ఆ సినిమా విడుదలయ్యాక, శ్రీకాంత్ ఓదెల ద్రుష్టి మొత్తం చిరంజీవి తో చేయబోయే స్కిప్ట్ పై పెడుతాడట. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయిందట కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని అప్పటి నుండే ప్రారంభిస్తాడట.
జూన్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిపి, జులై నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారట. ఈ సినిమాని మొదలు పెట్టే ముందు, మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో కొత్త సినిమాని మొదలు పెట్టి పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే, అనిల్ రావిపూడి తో మెగాస్టార్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా 12 వ తేదీన విడుదల కాబోతుంది.