Nidhi Agarwal: ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) హీరోయిన్స్ వేసుకునే దుస్తుల పై చేసిన కామెంట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేసినా కూడా, సినీ సెలబ్రిటీలు వదలడం లేదు. ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను తెలియచేస్తూనే ఉన్నారు. చీరలోనే అందం ఉంది, సామాన్లు కనిపించేలా వేసుకునే పొట్టి దుస్తుల్లో అందం లేదు, అంటూ హీరోయిన్స్ ని ఉద్దేశించి శివాజీ కామెంట్స్ చేయడం, దానికి నిన్న ఆయన క్షమాపణలు చెప్పడం, మరోసారి ఈరోజు దండోరా మూవీ ప్రెస్ మీట్ లో వివరణ ఇస్తూ, రీసెంట్ గా హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) కి జరిగిన ఘటన గురించి వివరిస్తూ ఆయన చేసిన కామెంట్స్ వివాదాన్ని ఇంకా పెద్దది చేసింది. దీనిపై నిధి అగర్వాల్ కూడా కౌంటర్ ఇస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది.
ఇంతకీ శివాజీ ఇచ్చిన వివరణ ఏమిటంటే ‘రీసెంట్ గా లుల్లూ మాల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కి జరిగిన ఘటన నుండి నేను ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఆరోజు ఆ అమ్మాయి అలాంటి బట్టలు వేసుకొని రావడం వల్లే ఆమెను ముట్టుకునేందుకు ఎగబడ్డారు, కారులోకి వెళ్లి కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి పడిన బాధ ని చూసి జాలేసింది. అందుకే నేను నిన్న అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. దీనిపై ఇన్ స్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ స్పందిస్తూ ‘విక్టిమ్ పై ఆరోపణలు చేయడాన్ని మ్యానిపులేషన్ అని అంటారు’ అంటూ స్టోరీ పెట్టింది. అంటే అక్కడ ఇబ్బందికి గురైంది నేను, అలాంటి నన్ను నా బట్టల కారణం గానే అలాంటి ఘటన జరిగింది అంటూ చెప్పుకొని రావడం అన్యాయం అన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది.
శివాజీ నిన్న క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ ఘటన గురించి మాట్లాడకుండా వదిలేసి ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఆయన వివరణ ఇస్తూ, నిధి అగర్వాల్, సమంత వంటి వారికి రీసెంట్ గా జరిగిన సంఘటనలను ఉదాహరణగా తీసుకొని అలా మాట్లాడాను అనడం దురదృష్టకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. రీసెంట్ ఒక షో రూమ్ ఓపెనింగ్ కి వచ్చిన సమంత చీర కట్టు లోనే వచ్చింది, అయినప్పటికీ ఆమెని చూడడం కోసం, ఆమెని ముట్టుకోవడం కోసం అభిమానులు ఎందుకు అలా ఎగబడ్డారు?, ఆ స్థానం లో హీరోయిన్స్ కి మాత్రమే కాదు, హీరోలు వచ్చినా ఆడియన్స్ అలాగే ఎగబడతారు. ఎందుకంటే వెండితెర పై ఇన్ని రోజులు చూస్తూ వచ్చిన సినీ తారలు, ఒక్కసారి తమ ముందుకొచ్చి నిలబడితే సామాన్యులు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు కదా, శివాజీ చాలా తప్పు ఉదాహరణ ఇచ్చాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.
#NidhhiAgerwal‘s Instagram Story! https://t.co/lGUSwdHR3P pic.twitter.com/aSGFSntHJx
— Gulte (@GulteOfficial) December 24, 2025