Pawan Kalyan and Namrata Shirodkar : టాలీవుడ్ లో కొన్ని డ్రీం కాంబినేషన్స్ కావాలని కోరుకుంటాం. కానీ అవి గతంలో కొన్ని అనుకోని కారణాల వల్ల కుదర్లేదు అనే విషయం తెలిసినప్పుడు చాలా నిరాశ చెందుతూ ఉంటాము. సోషల్ మీడియా లో ఇలాంటివి ఇది వరకు చాలానే చూసాము. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్, నమ్రత శిరోడ్కర్ కాంబినేషన్ చిత్రం. అప్పట్లో నమ్రత బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగేది. తెలుగులో ఆమె మొట్టమొదటి చిత్రం వంశీ. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబు తో ప్రేమలో పడింది, అతన్ని పెళ్లి చేసుకొని సుఖంగా జీవితం గడుపుతుంది. ఇదంతా మనకి తెలియని విషయాలు కావు. అయితే నమ్రత శిరోడ్కర్ అప్పట్లో పవన్ కళ్యాణ్ తో చెయ్యాల్సిన ఒక సినిమా, తృటిలో తప్పింది. ఆ సినిమా మరేదో కాదు, బద్రి. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిల్చింది.
ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అమీషా పటేల్, రేణు దేశాయ్ నటించారు. అమీషా పటేల్ క్యారక్టర్ కోసం ముందుగా నమ్రత శిరోడ్కర్ ని సంప్రదించాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్. కానీ ఆ సమయంలో ఆమె హిందీ లో మూడు చిత్రాలకు సంతకాలు చేసింది. బద్రి చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేసేందుకు చాలా ప్రయత్నాలే చేసింది కానీ, చివరికి కుదర్లేదు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది. అమీషా పటేల్ నమ్రత కంటే పెద్ద హీరోయిన్. ఆమె డేట్స్ దొరకడం కూడా కష్టమే కానీ, భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించింది. అయితే పవన్ కళ్యాణ్, నమ్రత కాంబినేషన్ మిస్ అయ్యింది కానీ, పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తో కలిసి మాత్రం ఆమె గతంలో ‘అంజి’ అనే చిత్రం చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.
ఇక మహేష్ బాబు ని పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమైంది. మరోపక్క పవన్ కళ్యాణ్ అదే బద్రి సినిమాలో నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని అనుకోని కారణాల వల్ల పదేళ్ల తర్వాత వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను కమిట్ అయిన సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ కి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ జనవరి 3న విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తో పాటు ఆయన సుజిత్ దర్శకత్వం లో ఓజీ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.