మంజరి ఫడ్నిస్ గురించి చాలా మందికి తెలుసు. ఈమె ఫోటోలు ఫ్యాషన్ ప్రేమికులకు భలే నచ్చుతాయి.
మంజరి ఫడ్నిస్ ప్రధానంగా బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో నటిస్తుంది.
ఆమె బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలలో కూడా కనిపించి మెప్పించింది.
2004లో బాలీవుడ్ చిత్రం రోక్ సాకో తో రోక్ లోతో సినిమాతో కెరీర్ ప్రారంభించింది ముద్దుగుమ్మ.
2008లో జానే తు... యా జానే నా చిత్రంలో నటించి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.
ఈ పాత్రలో నటించినందుకు ఆమెకు స్టార్‌డస్ట్ అవార్డు కూడా వచ్చింది.
ఆ తర్వాత మంజరి పలు ప్రముఖ చిత్రాలలో కూడా నటించింది. ఆమె 2006లో జాతీయ అవార్డు అందుకున్న బెంగాలీ చిత్రం ఫల్తులో కూడా నటించింది.
ఇక 2016లో ఖమాఖా అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా కనిపించింది, ఇది ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.