Ram Charan and Balayya : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో, ఇప్పుడు నాల్గవ సీజన్ లోకి అడుగుపెట్టింది. రీసెంట్ ఎపిసోడ్ కి వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, బాలయ్య తో చాలా ఫన్నీ గా గడిపాడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ అభిమానులకు కనుల పండుగలా అనిపించింది. అయితే ఈ సీజన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ఎపిసోడ్ కి ముఖ్య అతిథి గా రాబోతున్నాడని చాలా కాలం నుండి ఒక ప్రచారం సాగుతుంది. ఎట్టకేలకు రామ్ చరణ్ తదుపరి ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నట్టు కాసేపటి క్రితమే ఆహా మీడియా టీం అధికారికంగా స్పందించింది. రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది.
సంక్రాంతికి బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ చిత్రంతో పాటు, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగానే రామ్ చరణ్ వస్తున్నాడు. ఆయనతో మూవీ టీం కి సంబంధించి దిల్ రాజు, అంజలి వంటి వాళ్ళు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్, బాలయ్య బాబు కి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గతం లో ప్రభాస్ ముఖ్య అతిథి గా ‘అన్ స్టాపబుల్’ షో కి వచ్చినప్పుడు, రామ్ చరణ్ కి ఫోన్ చేస్తాడు బాలయ్య. రామ్ చరణ్ తో సరదాగా ఆయన మాట్లాడిన మాటలు ఎంత ఫన్నీ గా అనిపించాయో మనమంతా చూసాము. అదే విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా వచ్చినప్పుడు కూడా బాలయ్య రామ్ చరణ్ కే ఫోన్ చేసాడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన శారద సంభాషణ చూస్తే వాళ్ళు ఎంత క్లోజ్ అనేది అర్థం అవుతుంది.
బాలయ్య తనతో క్లోజ్ గా ఉన్నవాళ్లు షో కి వచ్చినప్పుడు, ఆ ఎపిసోడ్స్ బంపర్ హిట్ అయ్యాయి. రేపు రామ్ చరణ్ తో చేయబోయే ఎపిసోడ్ కూడా బంపర్ హిట్ అవ్వబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతున్న ఈ ఎపిసోడ్ షూటింగ్ కి అభిమానులు భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉంది. జనవరి మొదటి వారంలో ఈ ఎపిసోడ్ ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోని జనవరి రెండవ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ‘గేమ్ చేంజర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఎల్లుండి విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా జనవరి నాల్గవ తేదీన రాజమండ్రి లో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.