Pawan Kalyan and Mahesh Babu: మన టాలీవుడ్ కి నేడు ఓవర్సీస్ మార్కెట్ ఆయువుపట్టు లాంటిది. అలాంటి ఓవర్సీస్ మార్కెట్ ని క్రియేట్ చేసిన హీరోలు ఎవరంటే ట్రేడ్ నుండి వినిపించేది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan),మహేష్ బాబు(Super Star Mahesh Babu) పేర్లు మాత్రమే. ‘దూకుడు’ చిత్రంతో నార్త్ అమెరికా లో మొట్టమొదటి 1 మిలియన్ క్లబ్ మన టాలీవుడ్ సినిమాకు మొదలైంది. ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఆరు నెలల గ్యాప్ లో విడుదలై మరోసారి 1 మిలియన్ డాలర్ మార్కుని అందుకుంది. ఈ రెండు చిత్రాలు కూడా కేవలం 30 నుండి 40 లొకేషన్స్ నుండి మాత్రమే ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. మిగిలిన హీరోలు ఇంతకీ మూడు రెట్లు ఎక్కువ లొకేషన్స్ తో 1 మిలియన్ మార్కుని అందుకున్నారు. దీనిని బట్టి వీళ్లిద్దరు ఓవర్సీస్ లో ఏ రేంజ్ తోపులు అనేది అర్థం చేసుకోవచ్చు.
ఓవర్సీస్ కింగ్స్ అయ్యుండొచ్చు కానీ,ఈమధ్య కాలం లో వీళ్లిద్దరు ఓవర్సీస్ లో సినిమా షూటింగ్స్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ చివరిసారిగా ‘అజ్ఞాతవాసి’ చిత్రం కోసం విదేశాలకు వెళ్ళాడు. మహేష్ బాబు పరిస్థితి కూడా ఇంతే. చివరిసారిగా ఓవర్సీస్ షూటింగ్ ఎప్పుడు అని అడిగితే అభిమానులు కూడా చెప్పలేరు. ఆసక్తిని కలిగించే విషయం ఏమిటంటే ఇప్పుడు వీళ్లిద్దరు ఒకేసారి ఓవర్సీస్ లో షూటింగ్స్ చేయడానికి ప్రయాణం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజుల నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసమో, లేకపోతే ఓజీ మూవీ షూటింగ్ కోసమో క్లారిటీ గా తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసమే ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. రేపు సీఎం చంద్రబాబు తో టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ భేటీ కాబోతున్నారు. వీళ్లంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తమ వెంట పెట్టుకొని వెళ్లాలని అనుకున్నారు.
కానీ ఆయన షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నట్టు పీఆర్ టీం చెప్పిందట. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం వచ్చే మొదటి షెడ్యూల్ ని ఒడిశా లో షూట్ చేశారు. అదే విధంగా రెండవ షెడ్యూల్ ని హైదరాబాద్ లో కొన్ని రోజులు షూట్ చేశారు. ఇప్పుడు త్వరలోనే ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం కెన్యా కి వెళ్ళబోతున్నారు. మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. అలా చాలా కాలం తర్వాత ఈ ఓవర్సీస్ కింగ్స్ తమ సినిమా షూటింగ్స్ ని ఓవర్సీస్ లో ప్లాన్ చేసుకున్నారు. అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ సర్ప్రైజ్ అనే అనుకోవాలి.