Pawan Kalyan OG: పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి ఉన్న బిజీ పొలిటికల్ షెడ్యూల్ లో ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం యాదృచ్ఛికమే అని చెప్పొచ్చు. ఈ సినిమా ని మొదటి రోజు మొదటి ఆట ఎలా అయినా చూసేయాలి అనేంత ఆత్రుత కేవలం అభిమానుల్లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఉంది. ఇలాంటి అంచనాలు ఏర్పాటు చేసిన సినిమాలు పవన్ కళ్యాణ్ కెరీర్ లో జానీ, జల్సా, పులి,అజ్ఞాతవాసి వంటివి ఉన్నాయి. మళ్ళీ అలాంటి అంచనాలు ఈ చిత్రం పైనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో గతంలో బాలు, పంజా అనే సినిమాలు చేసాడు. ఓజీ కూడా ఆ జానర్ లో తెరకెక్కిన సినిమానే. అయితే ఇది నేటి తరం ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా తీశారు. అందుకే ఇంతటి క్రేజ్ ఏర్పడింది.
Also Read: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
ఇదంతా పక్కన పెడితే రాజకీయాల్లో బిజీ గా ఉంటూ, ఉప ముఖ్యమంత్రి గా పాలనలో నిమగ్నమై ఉండడం వల్ల ఓజీ షూటింగ్ కి దాదాపుగా ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత రీసెంట్ గానే ఈ చిత్రాన్ని మళ్ళీ మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశారు. బ్యాలన్స్ కొద్దిగా ప్యాచ్ వర్క్ ని ముంబై లో గత మూడు రోజుల నుండి చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ వర్క్ మొత్తం రీ రికార్డింగ్ మరియు ఎడిటింగ్ తో సహా పూర్తి అయ్యిందట. రీసెంట్ గానే ఔట్పుట్ ని చూసి మూవీ టీం చాలా సంతృప్తి చెందిందని అంటున్నారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టారట. ఒక నెల రోజుల్లో ఇది కూడా పూర్తి అవుతుందని అంటున్నారు.
ఆగష్టు మొదటి వారం నుండి గ్రాండ్ గా ప్రొమోషన్స్ ప్రారంబిస్తారట. ముందుగా మొదటి లిరికల్ సాంగ్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి ఈ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ, ‘హరి హర వీరమల్లు’ కోసం ఆపారు. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడింది. దీంతో ఓజీ మేకర్స్ కూడా ప్లాన్ మార్చుకున్నారు. ఆగష్టు నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి రోజుకి ఒక అప్డేట్ వస్తుందట. 14 ప్రోమో కట్స్ ని ఇప్పటికే డైరెక్టర్ సుజిత్ సిద్ధం చేసి పెట్టి ఉన్నాడట. వీటిని వారానికి ఒకటి వదిలేలా ప్లాన్ చేస్తున్నారు. ఓజీ నుండి చిన్న పోస్టర్ వస్తేనే సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. అలాంటిది ఈ రేంజ్ లో అప్డేట్స్ వస్తే ఇక అభిమానులకు భుక్తాయాసం రావడం పక్కాలా అనిపిస్తుంది.