Kurnool : తెలంగాణ “మేఘాలయ” ఘటనగా మారిన తేజేశ్వర్ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు చేస్తున్న దర్యాప్తులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత చెబుతున్న విషయాలు ఖాకీలను సైతం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
Kurnool : కెనరా బ్యాంకుకు అనుబంధం గా ఉన్న కాన్ ఫిన్స్ హోమ్స్ లిమిటెడ్ లో తిరుమల్ రావు మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇతడికి గతంలోనే వివాహం జరిగింది. అయితే మొదటి భార్యకు సంతానం కలిగే యోగ్యం లేదు. ఈ కార్యక్రమంలో అతడు తన బ్యాంకులో స్వీపర్ గా పనిచేసే సుజాతకు దగ్గరయ్యాడు. అది కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. సుజాత ఇంటికి తిరుమలరావు తరచూ వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోని సుజాత కూతురు ఐశ్వర్యను చూశాడు. ఆమెతో కూడా చనువు పెంచుకున్నాడు. ఆర్థిక అవసరాలను తీర్చడంతో ఆమె కూడా ఇతడి బుట్టలో పడింది. సుజాత, ఐశ్వర్యతో తిరుమలలో శారీరక సంబంధాలను కొనసాగించడం మొదలుపెట్టాడు. ఇక ఇదే క్రమంలో ఐశ్వర్యను వివాహం చేసుకోవాలని తిరుమలలో భావించాడు. తన వంశానికి వారసుడిని కనాలని అనుకున్నాడు.
ఎంగేజ్మెంట్ అయిన తర్వాత..
ఐశ్వర్య కు గద్వాలకి చెందిన తేజేశ్వర్ తో వివాహం కుదిరింది. అప్పటినుంచి అసలు కథ మొదలైంది. తేజేశ్వర్, ఐశ్వర్య కు గత ఏడ అది డిసెంబర్ 18న వివాహం జరిగింది. ఈ క్రమంలో తేజేశ్వర్ ను అంతం చేయడానికి దాదాపు ఐదుసార్లు రెక్కీ నిర్వహించారు. తేజేశ్వర్ తో వివాహం దగ్గర పడుతున్న క్రమంలో తిరుమలరావు ఐశ్వర్య మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తిరుమలరావు వద్దకు వెళ్లిపోయింది.. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. తేజేశ్వర్ ను ఆమె వివాహం చేసుకుంది. ఇక తేజేశ్వర్ ఇదే విషయం గురించి ప్రస్తావిస్తే.. అతని మీద పడి ఏడ్చింది. తనకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం వల్లే స్నేహితురాలు వద్దకు వెళ్లాల్సి వచ్చిందని ఐశ్వర్య చెప్పింది.. వివాహం జరిగిన తర్వాత కూడా తిరుమలరావుతో ఐశ్వర్య సంబంధం కొనసాగించింది. ఏమాత్రం అవకాశం దొరికినా చాలు అతడితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత తిరుమల రావు తో కలిసి తేజేశ్వర్ ను అంతం చేయాలని భావించింది.
ద్విచక్ర వాహనానికి జిపిఎస్ అమర్చింది
ఇందులో భాగంగానే తేజేశ్వర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో గమనించింది. అతడికి చక్రవాహనానికి జిపిఎస్ పరికరం అమర్చింది.. కొన్ని వేల కాల్స్ తిరుమల రావు తో ఐశ్వర్య మాట్లాడింది. ఇక అనుకున్న ప్రణాళిక ప్రకారం తేజేశ్వర్ ను అంతం చేయడానికి కర్నూలులో గోపి అనే వ్యక్తి కి చెందిన ఒక కారును నెలకు 25వేలు చెల్లించేలా తిరుమల రావు కిరాయి మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇటీవల బంధువుల పొలం హద్దులు చూపించాలని ఐశ్వర్య చెప్పడంతో 17వ తేదీన ద్విచక్ర వాహనంపై తేజేశ్వర్ వెళ్ళాడు. ఈ కార్యక్రమంలో తన ద్విచక్ర వాహనాన్ని ఫాతిమా ఐటీఐ కాలేజీ వద్ద ఆపాడు. ఇక అక్కడినుంచి తిరుమలరావు కారులో వెళ్లిపోయాడు.
మూకుమ్మడిగా దాడి చేశారు.
ఇటిక్యాల మండలం మొగలి రావుల చెరువు వద్ద పొలం హద్దులు చూసి.. తేజేశ్వర్ వస్తుండగా.. కారులో ఉన్న వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఆ దాడి నుంచి అతడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. వెనుక ఉన్న ఒక వ్యక్తి అతని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో కత్తితో అతడి గొంతును కోసేశారు. రెండు గంటల్లోనే ఆ దుండగులు తేజేశ్వర్ ను అంతం చేశారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని తిరుమల రావు, ఐశ్వర్య కు చెప్పారు. తేజేశ్వర్ కనిపించకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు ఇంటికి వస్తే ఐశ్వర్య పొంతన లేని సమాధానం చెప్పింది. మరోవైపు తేజేశ్వర్ ను అంతం చేయడానికి తిరుమలరావు డ్రైవర్ నగేష్ కీలకంగా పనిచేసినట్టు.. సుపారి మాట్లాడటంలో అతడే ముఖ్య పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.