
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రచారం జరగడంతో ఆయన స్పందించారు. ఈ ఎన్నికలో గెలిచినా..ఓడినా తాను కాంగ్రెస్ పార్టీని వీడనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎప్పటికీ చేరనని తేల్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, హరీశ్‌రావు కలిసి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ ఫేక్ న్యూస్‌ను ప్రజలు నమ్మొద్దన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. చిన్న గొడవ జరిగితే రాత్రి 2 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నానని, తన వెనుక పోలీస్ షాడో టీమ్ కూడా ఉందని చెప్పారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు.