Tollywood Heroes Remunerations: సినిమా ప్రపంచం అనేదే సక్సెస్ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. అందులో నటించే హీరో, హీరోయిన్లకు అమాంతం క్రేజ్ పెరిగిపోతోంది. దీంతో రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే.. ఈ పదేండ్లలోనే ఊహించని రేంజ్‌లో రెమ్యునరేషన్లు పెరిగిపోయాయి. మన టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల మార్కెట్ తో పాము రెమ్యునరేషన్లు కూడా అమాంతం పెరిగిపోయాయి.

ఇప్పుడు స్టార్ హీరోలకు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ఉండటంతో.. వారంతా ఒక సినిమాకు దాదాపు రూ.50 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఇక ప్యాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ప్రభాస్ లాంటి వారియితే రూ.100 కోట్ల దాకా కూడా తీసుకుంటున్నారంట. అయతే పదేండ్ల క్రితం ఇదే స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఎలా ఉండేదో చూద్దాం. సరిగ్గా పది సంవత్సరా కిందట అల్లు అర్జున్ వరుడు మూవీకి దాదాపు రూ.6 కోట్ల దాకా తీసుకున్నాడంట.

కానీ పుష్పకు మాత్రం రూ.50 కోట్ల దాకా తీసుకున్నాడంట. ఇక ఇప్పుడు రూ.100 కోట్ల దాకా ఇచ్చే నిర్మాతలు కూడా వస్తున్నారంట. ఇక పవన్ కూడా జల్సా మూవీకి రూ.8 కోట్లు తీసుకున్నాడంట. ఇప్పుడు మాత్రం రూ.60 కోట్ల దాకా తీసుకుంటున్నాడు. మహేష్ కూడా అప్పట్లో రూ.8 కోట్లు తీసుకుంటే.. ఇప్పుడు మాత్రం రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంట. ఇక పదేండ్ల క్రితం స్టార్ హీరోలు అయిన చరణ్ రూ.6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే.. ఎన్టీఆర్ రూ.9 కోట్ల దాకా తీసుకునే వాడంట.

Also Read: పాతిక సౌత్ సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ !
కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీకి ఇద్దరూ రూ.40 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇక బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ అందరి కంటే ఎక్కువ తీసుకుంటున్నాడు. ఒకప్పుడు రూ.5 కోట్లు తీసుకునే ప్రభాస్.. ఇప్పుడు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల దాకా తీసుకుంటున్నాడంట.

Also Read: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి ఆమె !

[…] Also Read: పదేండ్ల క్రితం తెలుగు హీరోల రెమ్యున… […]
[…] Read: పదేండ్ల క్రితం తెలుగు హీరోల రెమ్యున… ఆమెకు అన్ని విధాలుగా అండగా […]