Homeఎంటర్టైన్మెంట్మెగా ఫ్యామిలీ నుండి 'ఈ కథలో పాత్రలు కల్పితం'

మెగా ఫ్యామిలీ నుండి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’

తెలుగు సినీ చరిత్రలో “కొణిదెల” ఇంటి పేరుకి ఒక బ్రాండ్ ఉంది . కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అలియాస్ కొణిదెల చిరంజీవి తెలుగు పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఉన్నారు. ఆయన కాంపౌండ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తమ టాలెంట్‌ను నిరూపించుకుని, అభిమానుల మనసులు గెలుచుకుని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వస్తున్నాడు. ఆయన పేరు “పవన్ తేజ్ […]

Pavan Tej Konidela
తెలుగు సినీ చరిత్రలో “కొణిదెల” ఇంటి పేరుకి ఒక బ్రాండ్ ఉంది . కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అలియాస్ కొణిదెల చిరంజీవి తెలుగు పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఉన్నారు. ఆయన కాంపౌండ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తమ టాలెంట్‌ను నిరూపించుకుని, అభిమానుల మనసులు గెలుచుకుని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వస్తున్నాడు. ఆయన పేరు “పవన్ తేజ్ కొణిదెల”. మెగాస్టార్ చిరంజీవికి బంధువు అవుతాడట ఇతను. పవన్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మించిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎమ్ దర్శకత్వం వహించారు.ఈ మూవీలో పవన్ తేజ్ సరసన కథానాయికగా మేఘన అనే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు.

Also Read: వెయ్యి కోసం కేఫ్ లో పనిచేశా… బాబాయ్ జపాన్ పిల్ల అనేవాడు

ఈ మూవీ టీజర్‌ను మెగా బ్రదర్ నాగబాబు గురువారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘టీజర్ రిలీజ్ చేసిన నాగబాబు గారికి నా హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు. ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌కు ఎంటర్‌టైన్మెంట్ జోడించి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు అభిరామ్ క్వాలిటీ తగ్గకుండా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. టైటిల్‌కి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ‌డంతో మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది’’ అని అన్నారు.డైరెక్టర్ అభిరామ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో పవన్ తేజ్ మంచి పేరు తెచ్చుకుంటాడు. నిర్మాత గారు సినిమాను కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా నిర్మించారు. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’’ అని అన్నారు. కాగా టీజర్ బట్టి మిస్టరీగా మారిన ఓ కేసును ఛేదించే క్రమంలో హీరో మరియు పోలీసుల మధ్య జరిగే స్టోరీలాగ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్‌లో విడుదల అవటానికి సిద్ధం అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper