Pathala Bhairavi 75 Years Celebration: ఒక మంచి సినిమా చేయడానికి టెక్నాలజీ అవసరం లేదు. భారీ బడ్జెట్లు అవసరం లేదు. దర్శకుడి దగ్గర దమ్ముంటే బెస్ట్ కాన్సెప్ట్ తో సినిమా చేసి క్లాసిక్ హిట్ గా మార్చవచ్చు… సినిమా ఇండస్ట్రీ లో కొన్ని మూవీస్ దశాబ్దాల పాటు గుర్తుండిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని తరాలు మారిన సినిమా చూసే ప్రేక్షకుడి మైండ్ సెట్ చేంజ్ అయిన కూడా ఎప్పటికి ఆ సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ లభిస్తూనే ఉంటుంది… అందులో ఎన్టీఆర్ చేసిన ‘పాతాళ భైరవి’ సినిమా ఒకటి…ఈ సినిమా కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చాలా ఇష్టమైన సినిమా… జానపద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎవరు ఎలాంటి సినిమా చేయాలన్నా కూడా ముందు పాతాళ భైరవి సినిమా చూడు అని చెప్తుంటారు. జనాల్లో అంతటి ఇంపాక్ట్ ను కలిగించిన సినిమా అది…ఆ సినిమాలో నటించిన నటీనటులకు ఎంత గౌరవం దక్కుతుందో దాన్ని తెరకెక్కించిన దర్శకుడు కె.వి.రెడ్డికి అంతకుమించిన క్రేజ్ వచ్చింది… ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు…చూసిన ప్రతిసారి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక మార్చి 15, 1951 వ సంవత్సరంలో రిలీజ్ అయిన పాతాళభైరవి సినిమా ఈ మార్చి 15వ తేదీకి 75 వ సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది…ఈ సినిమాని తీయడానికి దర్శకుడు కె.వి.రెడ్డి ఎలా కష్టపడ్డాడు. ఇందులోకి ఎన్టీఆర్ ఏ విధంగా వచ్చాడు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: డైరెక్టర్ గా మారిన శేఖర్ మాస్టర్.. తొలిసినిమా తోనే స్టార్ హీరో కొడుకుతో ఛాన్స్!
దర్శకుడు కేవి రెడ్డి కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ వచ్చాడు. జానపద చిత్రాల వైపు అతను అసలు మొగ్గు చూపలేదు. కానీ ఆయన చేసిన కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బాలనాగమ్మ కథని సినిమాగా చేయాలని అనుకున్నాడు. కానీ అది అనుకోని కారణాలవల్ల కార్యరూపం దాల్చలేదు… అయితే కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న కె.వి.రెడ్డికి విజయ బ్యానర్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది… మన బ్యానర్ లో ఒక అదిరిపోయే జానపద సినిమా చేయాలని విజయ బ్యానర్ వారు కేవీరెడ్డిని అడగగా ఆయన తన ఆ స్థాన రచయిత అయిన పింగళి గారిని కూర్చోబెట్టుకొని కొన్ని కథలను చదివించాడు.
కాశీ మజిలీ కథలను చదువుతున్నప్పుడు వాళ్ళకి ‘పాతాళ భైరవి’ కథ స్ట్రైక్ అయింది. దాంతో వెంటనే ఆ కథను సిద్ధం చేశారు… ఈ సినిమాలో తోటరాముడి పాత్ర చాలా హైలైట్ అవ్వబోతుందనే విషయాన్ని వాళ్ళు ముందుగానే గ్రహించారు. తోటరాముడి పాత్రకి ఎవరిని తీసుకుందాం అనేది మాత్రం వాళ్ళ మైండ్ కి స్ట్రైక్ అవ్వలేదు. ఇక ఈ క్రమంలోనే విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ అలాగే వాడు మాయలు, మంత్రాలు చేస్తాడు.
అందుకని ఆ పాత్ర కోసం ఒక భారీ వ్యక్తి కావాలి అని ముందే నిర్ణయించుకున్నారు. ఇక మొదట హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ని తీసుకోవాలని అనుకున్నప్పటికి విజయ బ్యానర్ ప్రొడ్యూసర్ ఆయన చక్రపాణి మాత్రం అప్పటికే ఎన్టీఆర్ తో కొన్ని సినిమాలు చేయడానికి సైన్ చేయించుకున్నాడు. దానికి నెలకి 250 రూపాయల చొప్పున చెల్లిస్తానని అగ్రిమెంట్ ని కూడా కుదుర్చుకున్నాడు. ఇక మొత్తానికైతే కె.వి.రెడ్డి నాగేశ్వరరావు తో ఈ సినిమా వర్కౌట్ కాదని చెప్పడంతో నాగేశ్వరరావు ను పక్కన పెట్టారు. ఇక ఈ క్రమంలోనే ‘సంసారం’ అనే సినిమా షూటింగ్లో పాల్గొన్న ఎన్టీఆర్…అక్కడే ఉన్న నాగేశ్వరరావు తో కలిసి టెన్నిస్ ఆడుతున్నప్పుడు కె.వి.రెడ్డి చూశారట.
దాంతో ఎన్టీఆర్ అ టెన్నిస్ బంతిని కొడితే అది దాదాపు ఆ గ్రౌండ్ అవతల పడిపోయిందట. అది చూసిన కెవి రెడ్డి మన తోట రాముడు పాత్రకి ఇలాంటి వ్యక్తే కావాలి అని ఎన్టీఆర్ ను సెట్ చేశాడట. ఇంకా విలన్ పాత్ర కోసం ఎస్వీ రంగారావుని తీసుకున్నారు. అప్పటికే ఎస్వీ రంగారావు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుంటే అతనికి అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. కానీ కేవి రెడ్డి మాత్రం రంగారావు మనకు సెట్ అవుతాడు అని చక్రపాణి కి చెప్పి ఆయన్ని విలన్ పాత్ర కోసం తీసుకున్నాడు. మొత్తానికైతే హీరో విలన్ ఇద్దరు ఈ సినిమాకి రెండు పిల్లర్లుగా నిలవడం వల్ల ఈ సినిమాను అద్భుతమైన విజయం వైపు తీసుకెళ్లింది…
మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు సైతం సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించారు. ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హీరో విలన్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సైతం చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు సైతం అంత మంచి కాన్ఫ్లిక్ట్ ని సెట్ చేయలేకపోతున్నారు. అలాగే ఈ సినిమాలో ఉన్న మాయలు మంత్రాలను సైతం ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే కె.వి.రెడ్డి చాలా అద్భుతంగా తీసి చూపించాడు అంటే మామూలు విషయం కాదు… మరి అలాంటి ఒక గొప్ప సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంటే దానికి తెలుగు వాళ్ళమైన మనందరం గర్వపడాలి…
