Parusuram and Naga Chaitanya : పూరి జగన్నాధ్ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న పరుశురాం మహేష్ బాబు తో చేసిన ‘సర్కారు వారి పాట’ సమయంలో నాగచైతన్యతో ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాని చేయకుండా సర్కారు వారి పాట సినిమా చేశాడు. దాంతో పరశురాం మీద నాగచైతన్య కొంతవరకు కోపానికి అయితే వచ్చారట. కారణం ఏంటి అంటే పరశురాం సినిమా కోసం డేట్స్ ని కేటాయించిన నాగచైతన్య ఇతర సినిమాలను క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ తీరా పరుశురాం మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయడం వల్ల తన డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో నాగ చైతన్య కొంతవరకు ఆయన మీద ఫైర్ అయ్యారట. ఈ విషయంలోనే పరుశురామ్ కి నాగచైతన్యకు మధ్య కొంతవరకు విభేదాలైతే వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా గతంలో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ చాలా సార్లు వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్య రూపం దాల్చలేదు… ఇక ఇదిలా ఉంటే పరుశురాం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గీతా గోవిందం సినిమా చేశాడు. ఇది సూపర్ హిట్ అయింది. దాంతో అల్లు శిరీష్ ను హీరోగా పెట్టి ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమా చేశాడు.
Also Read : నాని, నాగ చైతన్య కాంబినేషన్ లో మిస్ అయిన క్రేజీ మల్టీస్టార్రర్ అదేనా..? చేసుంటే వేరే లెవెల్ ఉండేది!
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా చేయాలని అల్లు అరవింద్ అతనితో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడు. తీరా సమయం వచ్చిన తర్వాత ఆయన గీతా ఆర్ట్స్ లో చేయకుండా వేరే వాళ్లతో సర్కార్ వారి పాట సినిమా చేయడంతో అల్లు అరవింద్ కి తనకు మధ్య కూడా కొన్ని విభేదాలు అయితే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇక విజయ్ దేవరకొండ తో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు. దాంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో కూడా ముందుకు రావడం లేదు. ఏ ప్రొడ్యూసర్ కూడా అతని కథలను వినడానికి ఆసక్తి చూపించడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే పరుశురాం మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందని తద్వారా స్టార్ డైరెక్టర్ లిస్టులోకి చేరుకోవాలి అంటే మాత్రం ఆయన భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇప్పుడొచ్చిన యంగ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా నేపధ్యంలో సినిమాలు చేస్తూ వరుస విజయాలను సాధిస్తుంటే పరశురామ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక భారీ సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నాడు… మరి ఇకమీదటైనా ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పించి సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…
Also Read : ఆమెని మర్చిపోలేక చాలా రోజులు ఏడ్చాను..మానసిక వేదన అనుభవించాను : అక్కినేని నాగ చైతన్య!