https://oktelugu.com/

Akkineni Naga Chaitanya : ఆమెని మర్చిపోలేక చాలా రోజులు ఏడ్చాను..మానసిక వేదన అనుభవించాను : అక్కినేని నాగ చైతన్య!

నాగ చైతన్య రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ 'నేను స్కూల్ డేస్ లో ఒక అమ్మాయిని ఘాడంగా ప్రేమించాను. అయితే ఒక రోజు ఆ అమ్మాయి స్కూల్ మారిపోయింది. నా గుండె బద్దలు అయ్యినంత పనైంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 10:01 PM IST

    Akkineni Naga Chaitanya

    Follow us on

    Akkineni Naga Chaitanya : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన అక్కినేని నాగచైతన్య పేరు కనిపిస్తూనే ఉంది. రీసెంట్ గానే ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన పనులు కూడా వేగవంతం అయ్యాయి. పెళ్ళికి ముందు జరిగే సంప్రదాయాలను తూచా తప్పకుండా అనుసరిస్తుంది శోభిత. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. పెళ్లి తేదీ ఎప్పుడు అనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ, పెళ్లి పనుల చకచకా జరుగుతుండడం చూస్తుంటే వచ్చే నెలలోనే అని అర్థం అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అక్కినేని కుటుంబం సోషల్ మీడియా ద్వారా తెలియచేయనుంది. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను స్కూల్ డేస్ లో ఒక అమ్మాయిని ఘాడంగా ప్రేమించాను.

    అయితే ఒక రోజు ఆ అమ్మాయి స్కూల్ మారిపోయింది. నా గుండె బద్దలు అయ్యినంత పనైంది. ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని మరీ వెళ్లి అడిగాను, ఎందుకు స్కూల్ మారిపోయావు అని. ఆ అమ్మాయి అలా వెళ్లిపోవడం తో నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది అనేంత బాధ వేసింది. అయితే కాలం గడిచే కొద్దీ ఆ అమ్మాయిని నేను మర్చిపోయాను. అయితే కాలేజీ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితే నాకు ఎదురైంది. అది కూడా విఫలం అవ్వడంతో మళ్ళీ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ రోజులను గుర్తు చేసుకుంటే, ఇంత స్టుపిడ్ గా నేను అఫైర్స్ నడిపించానా అని అనిపిస్తుంది. నేను అంతే, చాలా ఎమోషనల్ వ్యక్తిని. ఎవరైనా ప్రేమించి వాళ్ళను పోగొట్టుకుంటే నేను తట్టుకోలేను. మానసికంగా చాలా కృంగిపోతాను. నా దురదృష్టం కొద్దీ నా జీవితం లో ఇలాంటి సంఘటనలు రిపీట్ గా జరుగుతూనే వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.

    ఒకపక్క తన పాత లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ని చెప్పుకుంటూనే, మరోపక్క ఆయన పరోక్షంగా సమంతతో విడిపోయినప్పుడు ఎంత మానసిక వేదన అనుభవించాడో చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య మాటలను విన్న అభిమానులు ఎమోషనల్ అయ్యి ఇక నుండి నీ కొత్త జీవితం బాగుంటుంది, బాగుండాలని మేము ఆ దేవుడిని ప్రార్థిస్తాము అంటూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చందు మొండేటితో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సుమారుగా 75 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.