Nani and Naga Chaitanya combination
Nani and Naga Chaitanya combination : మీడియం రేంజ్ హీరోలలో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో నేచురల్ స్టార్ నాని(National Star Nani), అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) వంటి వారు ముందు వరుసలో ఉంటారు. వీళ్లిద్దరు కూడా పక్కింటి కుర్రాళ్ళు తరహా పాత్రలు పోషించడం లో దిట్ట. నాని ఒకప్పుడు డిఫరెంట్ జానర్ సినిమాలు తీస్తున్నాడు అనే పేరు ఉండేది. నాగ చైతన్య కి నేటి తరం లవర్ బాయ్ ఇమేజి ఉండేది. మీడియం రేంజ్ హీరోలలో నాని, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రామ్ పోతినేని(Ram Pothineni) వంటి వారికి మంచి మార్కెట్ , క్రేజ్ ఉంటుంది. అయితే వీళ్ళ కాంబినేషన్ మల్టీస్టార్రర్ చేస్తే బిజినెస్ పరం గా వేరే లెవెల్ లో ఉంటుంది కదా, ఎందుకని ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు అంటూ విశ్లేషకులు సైతం అనేక సందర్భాల్లో ఈ అంశంపై మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
మిగిలిన హీరోల మల్టీస్టార్రర్ చిత్రాల సంగతి కాసేపు పక్కన పెడితే, నాని, నాగచైతన్య కాంబినేషన్ లో గతం లో ఒక మల్టీస్టార్రర్ ప్లాన్ చేశారట మేకర్స్. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదని తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో నాగచైతన్య, సునీల్ కాంబినేషన్ లో తడాకా అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, కాటంరాయుడు వంటి చిత్రాలను తెరకెక్కించిన డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వచించాడు. తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అయితే ఈ సినిమాలో సునీల్ పాత్ర కోసం ముందుగా నేచురల్ స్టార్ నాని ని అడిగారట. నాని కి అప్పట్లో పెద్దగా క్రేజ్ లేదు, అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న సమయం అది. చేయడానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు కానీ, డేట్స్ క్లాష్ వల్ల చేయలేకపోయాడట.
ఇక ఆ తర్వాత సునీల్ ని సంప్రదించడం, ఆయన వెంటనే ఒప్పుకొని సినిమా చేయడం వంటివి జరిగాయి. ఈ సినిమాలో సునీల్ క్యారక్టర్ మొదటి నుండి చాలా అమాయకంగా ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో జరిగిన ఒక సంఘటన కారణంగా మోస్ట్ వయొలెంట్ పోలీస్ గా మారిపోతాడు. ఆయన పాత్రకు చాలా ఎలివేషన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఒకవేళ నాని ఆ క్యారక్టర్ లో కనిపించి ఉండుంటే, పర్ఫెక్ట్ మల్టీస్టార్రర్ చిత్రం అయ్యేది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాకి రేంజ్ బాగా పెరిగేది, మంచి క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల మార్కెట్ సమానంగానే ఉంది. నాగ చైతన్య కంటే నాని కి కాస్త ఇంకా బెటర్ మార్కెట్ ఉంది. ఓవర్సీస్ లో అయితే నాని రేంజ్ స్టార్ హీరోలతో సమానం. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి ఒక మల్టీస్టార్రర్ చేస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వేరే లెవెల్ వసూళ్లు వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.