Param Sundari Trailer Review: సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో సినిమాలను చేస్తున్న దర్శకుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇక పాన్ ఇండియా సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో సక్సెస్ ల రేటు కూడా చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే దర్శకులు మంచి కథలను సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో తుషార్ జలోటా దర్శకత్వంలో ‘ పరమ్ సుందరి’ అనే సినిమా తెరకెక్కుతోంది.ఈ మూవీని ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ కేరళకు చెందిన అమ్మాయిగా కనిపిస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీకి చెందిన అబ్బాయిగా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే రొమాంటిక్ సీన్స్ తో చాలా నీట్ గా కట్ చేశారు. ముఖ్యంగా ఇందులో హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది… ఇక ఎప్పుడైతే ఈ సినిమా ట్రైలర్ వచ్చిందో ప్రేక్షకులకు ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్లో ఎక్కడ డివియెట్ అవ్వకుండా చెప్పాలనుకున్న పాయింట్ ను స్ట్రైయిట్ గా చెప్పే విధంగా ట్రైలర్ కట్ అయితే చేశారు…సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. అలాగే జాన్వీ కపూర్ కూడా దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
Also Read: స్టార్ నిర్మాత రియల్ లైఫ్ లవ్ స్టోరీ తో నారా రోహిత్ కొత్త సినిమా!
ఆమె పాత్రకి ఆ సినిమాలో పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికి కనిపించినకొని సీన్స్ లోనే తన నటనతో మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. మరి ఈ సినిమాలో మాత్రం చాలా బబ్లీగా కనిపిస్తూ కేరళ అమ్మాయి ఎలాగైతే ఉంటుందో అలాంటి ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ తో కామెడీని క్రియేట్ చేసుకొని మరి కామెడీని పండించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది.
అలాగే రజనీకాంత్, మోహన్ లాల్, అల్లు అర్జున్ లాంటి హీరోలను వాడుతూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం కూడా చేసింది… బాలీవుడ్ లో ఇలాంటి మంచి సబ్జెక్టుతో సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతోంది. కాబట్టి బాలీవుడ్ లో ఈ సినిమాకి ప్రేక్షకుడి నుంచి మంచి స్పందన వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
ట్రైలర్ లో చూపించినట్టుగా సినిమాని సైతం ఎక్కడ డివియెట్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినట్లయితే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…అయితే అంత ఒకే కానీ ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా మాస్ సినిమాలకు అలవాటు పడిపోయారు… మరి ఇపాంటి సినిమాను వాళ్ళు చూసి ఆదరిస్తారా అనేది తెలియాల్సి ఉంది…
