Nara Rohit New Movie: చేసే ప్రతీ సినిమా డిఫరెంట్ గా ఉండాలి, ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించాలి అని తపన పడే హీరోలలో ఒకరు నారా రోహిత్(Nara Rohit). పెద్ద పొలిటికల్ కమ్ సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరో. ఆయన తల్చుకుంటే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయొచ్చు. కానీ ఆయన మాత్రం తన మనసుకి నచ్చిన సినిమాలనే చేస్తూ, తన సొంత కాళ్ళ మీద నిలబడాలని అనుకున్నాడు. అందుకే కమర్షియల్ హీరో గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ, ఆడియన్స్ లో మాత్రం ఒక మంచి ఇమేజ్ ని మాత్రం సంపాదించుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత రీసెంట్ గానే ఆయన ‘భైరవం’ చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు. ఈ సినిమాలో నారా రోహిత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి, కానీ కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
Also Read: వార్ 2 vs కూలీ సినిమాల్లో ఏ మూవీ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్లస్…
ఇక ఆయన సోలో హీరో గా నటించిన చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం లో శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వాఘవి హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత నారా రోహిత్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాతో మన ముందుకు రాబోతున్నాడని ఈ ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతుంది.
Also Read: ‘వార్ 2’ నుండి 28 సన్నివేశాలను కత్తిరించిన సెన్సార్ బోర్డు..ఎన్టీఆర్ కి అన్యాయం?
పెళ్లి వయస్సు దాటిపోయినా హీరో పెళ్లి కష్టాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది నిజజీవితం లో ఉన్నవారికి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. తమ బయోపిక్ నే వెండితెర మీద చూసుకున్నట్టు ఉంటుంది. ఈ క్రమం లో పాపం హీరో కష్టాలను వివరిస్తూ ఈ ట్రైలర్ లో చూపించిన ర్యాప్ సాంగ్ బాగా హైలైట్ అయ్యింది.ఇక ట్రైలర్ చివర్లో ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీస్ గురించి వివరిస్తూ దిల్ రాజు, తేజస్విని వివాహాన్ని ప్రస్తావించడం మరో హైలైట్ అంశం గా పరిగణించొచ్చు. చివర్లో దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చారంటే, ఆయన రెండవ పెళ్లి హిస్టరీ ని తెలుసుకొని, ఆయన స్టోరీ నే సినిమాగా తీసారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. డైరెక్టర్ ఎంచుకున్న సబ్జెక్టు అలాంటిది కాబట్టి, కథ ని సిద్ధం చేసేటప్పుడు కచ్చితంగా పరిశోధన చేసి ఉంటాడు. అందులో భాగంగా దిల్ రాజు లవ్ స్టోరీ ని కూడా విని ఉంటాడని సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.
