https://oktelugu.com/

Paradise: నాని చేస్తున్న ప్యారడైజ్ కథ అక్కడి నుంచి తీసుకున్నారా..? ఇది నిజంగా జరిగిందా..?

Paradise ప్రాస్టిట్యూట్ కి పుట్టిన కొడుకు గా నాని ఈ సినిమాలో నటించబోతున్నాడు. అందుకే అతని చేతి మీద టాటు కూడా వేయించుకున్నాడు.

Written By: , Updated On : April 3, 2025 / 09:11 PM IST
Paradise

Paradise

Follow us on

Paradise: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే స్టార్ ఇమేజ్ అయితే దక్కుతుంది. ఇక మరి కొంతమంది వరుస సక్సెస్ లను సాధించి స్టార్ హీరో అనే ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి అది అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది…

Also Read: కేవలం ఒక్కటి మాత్రమే..మహేష్ ఫ్యాన్స్ కి చేదువార్త చెప్పిన రాజమౌళి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని(Nani)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొతాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే వరసగా మూడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన మరోసారి ‘హిట్ 3’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradaise) సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా అలాగే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా అనే విషయాల మీదనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి అంటూ కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది ఒక రెడ్ లైట్ ఏరియా కు సంబంధించిన స్టోరీ అనే వార్తలైతే వస్తున్నాయి. 1960వ సంవత్సరంలో హైదరాబాదులోని ఒక రెడ్ లైట్ ఏరియా కి పారడైజ్ అనే పేరు అయితే ఉండేది. ఆ కథతోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది నిజంగా జరిగిన స్టోరీ కావడం తో ఈ సినిమాను చూడటానికి ప్రతి ఒక్కరు అసక్తి చూపిస్తున్నారు.

ఒక ప్రాస్టిట్యూట్ కి పుట్టిన కొడుకు గా నాని ఈ సినిమాలో నటించబోతున్నాడు. అందుకే అతని చేతి మీద టాటు కూడా వేయించుకున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు… మరి ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల స్టార్ట్ డైరెక్టర్ గా మారుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు నాని చేసిన సినిమాలు ఒకే టైప్ లో ఉంటే ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు మాస్ ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉండబోతున్నాయి. మరి ఆయన కనక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే స్టార్ హీరోగా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంటాడు. ఇప్పటి వరకు ఆయన ఫ్యామిలీ, కామెడీ సినిమాలను చేస్తూ వచ్చాడు. ఒక్కసారిగా రూట్ మార్చి మాస్ సినిమాల వైపు దూసుకెళ్ళడం అనేది నిజంగా ఆయనలోని చేంజ్ ఓవర్ ని జనాలకు చాలా కొత్తగా పరిచయం చేస్తుందనే చెప్పాలి…