https://oktelugu.com/

Rajamouli: కేవలం ఒక్కటి మాత్రమే..మహేష్ ఫ్యాన్స్ కి చేదువార్త చెప్పిన రాజమౌళి!

Rajamouli బాహుబలి స్టోరీ కి స్కోప్ ఉంది కాబట్టే, రెండు భాగాలుగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం సీక్వెల్ ని తీసే ఉద్దేశ్యంతో స్టోరీ ని డెవలప్ చేసి సినిమాలు చేయలేదు.

Written By: , Updated On : April 3, 2025 / 08:28 PM IST
Rajamouli , Mahesh Babu

Rajamouli , Mahesh Babu

Follow us on

Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. అటు రాజమౌళి కానీ, మేకర్స్ కానీ ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రకటన కూడా అధికారికంగా చేయలేదు. అయినప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుందంటే, ఈ చిత్రానికి ఏర్పడిన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలంలో ఏ పాన్ ఇండియన్ సినిమాని తీసుకున్నా, రెండు పార్టులుగా తెరకెక్కడం మేమంతా చూస్తూనే ఉన్నాం. అవసరం ఉన్నా లేకపోయినా, కేవలం బిజినెస్ యాంగిల్ లో అలోచించి సీక్వెల్స్ కి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సీక్వెల్స్ బాగా వర్కౌట్ అయ్యి సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లాయి. కొన్ని మాత్రం డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ రాజమౌళి మాత్రం కథకు అవసరం ఉంటేనే సీక్వెల్ ని ప్రకటిస్తాడు, లేదంటే సింగల్ సినిమాతోనే వదిలేస్తాడు.

Also Read: శ్రీకాళహస్తిలో పూజ హెగ్డే..ఫ్లాపులు వస్తేనే ఈమెకు దేవుడు గుర్తుకొచ్చాడా?

బాహుబలి స్టోరీ కి స్కోప్ ఉంది కాబట్టే, రెండు భాగాలుగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం సీక్వెల్ ని తీసే ఉద్దేశ్యంతో స్టోరీ ని డెవలప్ చేసి సినిమాలు చేయలేదు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న చిత్రానికి ఎలాంటి సీక్వెల్, ప్రీక్వెల్ ఉండదట. ఈ సినిమా ప్రారంభానికి ముందు అనేక రూమర్స్ వినిపించాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడని, ఈ మూడు భాగాలు పూర్తి అయ్యేసరికి పదేళ్ల సమయం పడుతుంది. అంత సమయం అయితే మహేష్ బాబు కెరీర్ కూడా ముగింపు దశకు వచ్చేస్తుంది. ఇలా అయితే ఎలా ?, మరోపక్క ఎన్నేళ్లు అయినా పర్వాలేదు కానీ, మా హీరోకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమాలు ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం కేవలం ఒక భాగానికి మాత్రమే ఈ చిత్రాన్ని పరిమితం చేస్తున్నట్టు తెలుస్తుంది.

రీసెంట్ గానే ఒడిశా లో మొదటి షెడ్యూల్ షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం, రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఈ చిత్రం లో విలన్స్ గా ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ చేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తారని తెలుస్తుంది. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. 2027 వ సంవత్సరం లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారట, అందుకు తగ్గట్టు వరుస షెడ్యూల్స్ ని కూడా ప్లాన్ చేశాడు రాజమౌళి.