Panchayat Season 4: డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ముఖ చిత్రం మార్చేశాయి. అంతకంతకు ఓటీటీ సంస్థలకు ఆదరణ పెరుగుతుంది. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందిస్తున్న అన్ లిమిటెడ్ కంటెంట్ కూడా ఇందుకు కారణం. వివిధ భాషలకు, దేశాలకు చెందిన సినిమాలు, సిరీస్లు ఎంచక్కా… ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అసలు సినిమాలకు మించిన కంటెంట్ వెబ్ సిరీస్లలో ఉంటుంది. కాగా హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది.
పంచాయత్ గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా. 2020లో ఫస్ట్ సీజన్ ప్రసారమైంది. 8 ఎపిసోడ్స్ తో కూడిన పంచాయత్ విశేష ఆదరణ దక్కించుకుంది. పంచాయత్ సిరీస్లో జితేంద్ర కుమార్ ప్రధాన పాత్ర చేశాడు. గ్రామ పంచాయితీ సెక్రెటరీ అయిన అభిషేక్ త్రిపాఠిగా ఆయన పాత్ర విపరీతమైన కామెడీ పంచుతుంది. రఘువీర్ యాదవ్, నీనా గుప్త, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్ ఇతర కీలక రోల్స్ చేశారు.
పంచాయత్ సిరీస్ ని చందన్ కుమార్ రచించారు. దీపక్ కుమార్ మిశ్రా అద్భుతంగా తెరకెక్కించారు. సీజన్ 1 సక్సెస్ నేపథ్యంలో 2022లో సీజన్ 2 తీసుకొచ్చారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో కూడిన సీజన్ 2 సైతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక లేటెస్ట్ సీజన్ 2024 మే 28న అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా పంచాయత్ మూడు సిరీస్లు పూర్తి చేసుకుంది. మొత్తం 24 ఎపిసోడ్స్.
అమెజాన్ ప్రైమ్ లో పంచాయత్ సిరీస్ అందుబాటులో ఉంది. కాగా నాలుగో సీజన్ కి రంగం సిద్ధమైంది. 3 ఎపిసోడ్స్ కి పైగా స్క్రిప్ట్ పూర్తి చేశారట. అక్టోబర్ 25 నుండి పంచాయత్ సీజన్ 4 షూటింగ్ మొదలు కానుందని సమాచారం. దాంతో ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విక్రమ్ తంగలాన్ ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అక్టోబర్ 31 నుండి తంగలాన్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.