Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీసులు తన పై పెట్టిన కేసులకు భయపడి ప్రశాంత్ ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసాడని వరుస కథనాలు వెలువడ్డాయి. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రశాంత్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. పైగా ఇతర కంటెస్టెంట్ల కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ పై పబ్లిక్ న్యూసెన్స్ తో పాటు పలు సెక్షన్స్ క్రింద కేసులు పెట్టారు.
అయితే ఎవరో చేసిన దాడులకు ప్రశాంత్ ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ రోజు ప్రశాంత్ కూడా నిర్లక్ష్యంగా వ్యహరించాడు. అయితే పోలీసులు గొడవ జరిగే వైపు రావద్దు అని .. వెనుక గేట్ నుంచి బయటకు పంపించారు. అయితే ప్రశాంత్ వారి ఆదేశాలను పట్టించుకోలేదు. కారులో గొడవ జరిగే ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
దీంతో ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేసారు. తాజాగా ఈ కేసు పై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేష్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘ ప్రశాంత్ పై కక్ష సాధింపు చర్యలు తగవని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు. ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు .. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసులకు భయపడి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు.
దీంతో FIR కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన భద్యత పోలీసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్ కి బెయిల్ కి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అని అన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది. ‘ అని హైకోర్టు న్యాయవాది కే రాజేష్ కుమార్ వెల్లడించారు. కాగా పల్లవి ప్రశాంత్ నేను ఎక్కడికీ పారిపోలేదంటూ వీడియో విడుదల చేశాడు.