Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా మంచి గుర్తింపు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్..ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో తెలుగు సినిమాలకి కథ మాటల రచయిత గా పనిచేశాడు. ఆయన కథ మాటలు అందించిన సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ లు అవ్వడంతో స్టార్ హీరోలు సైతం అతను రాసిన కథతో సినిమా చేయాలని ఆరాటపడేవారు.ఇక అలాంటి క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు తన కథలను అందించాడు. ఇక అనతి కాలంలోనే తను కూడా డైరెక్టర్ గా మారి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలను చేస్తూ వచ్చాడు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అని ఇప్పటికే అనౌన్స్ చేశారు అయితే ఈ కథ మీద ఇప్పుడు చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అలా వైకుంఠపురంలో సినిమాతో ఇంటిగుట్టు అనే ఒక పాత సినిమా మెయిన్ కథాంశాన్ని తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును కొట్టింది. ఇక దాంతో ఈసరి వీళ్ళ కాంబోలో సినిమా రావడానికి రెడీ అయింది. ఇప్పటికే వీళ్ళ కాంబో లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా మరొక సినిమా రాబోతున్న క్రమంలో వీళ్ళ కాంబినేషన్ మీద చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మరోసారి ఏదో ఒక హాలీవుడ్ సినిమాని కాపీ చేసి మరొక హిట్టుకుబోతున్నాడు అంటూ పలు రకాల రూమర్లు వస్తున్నాయి.
మరికొందరు మాత్రం ఈసారి హాలీవుడ్ సినిమా కాదు కొరియన్ సినిమా కాపీ చేయబోతున్నాడు గురూజీ అంటూ త్రివిక్రమ్ పైన భారీ ఎత్తున సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు అయితే పెడుతున్నారు. అయితే వాళ్ళు ఇలా ఎందుకు పెడుతున్నారు అనేది తెలియదు గానీ, త్రివిక్రమ్ అభిమానులు మాత్రం ఈ కామెంట్స్ చూసి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబు తో చేస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కి రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయ్యక అల్లు అర్జున్ సినిమా మీద త్రివిక్రమ్ కూర్చోబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇక మరోసారి వీళ్ళ కాంబో లో సక్సెస్ కొట్టడానికి రెఢీ అవుతున్నారు…