Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. రైతుబిడ్డగా పేరుగాంచిన ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ తో మరింత ఎక్కువగా వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయినప్పుడు పల్లవి ప్రశాంత్ మీద ప్రజలకున్న అభిప్రాయం వేరని చెప్పుకోవచ్చు. అదేంటి గేమ్ వదిలేసి ప్రతిసారి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడు, మరో హౌజ్ మేట్ రతిక వెంట పడుతున్నాడు ఏంటి అనే ఫీలింగ్ దాదాపు ప్రతి ఒక్కరిలో కలిగింది.. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పల్లవి ప్రశాంత్ ఆట చూస్తే ప్రజలకు మతి పోయింది. ఇది వరకు ఇలా ఆడుతున్నాడేంటి? అనుకున్న ప్రజలు శభాష్ అనే స్థాయికి చేరుకున్నారు.
ఇక బిగ్ బాస్ ప్రొగ్రాంలో ఫిజికల్ టాస్కుల గురించి తీసుకుంటే పల్లవి ప్రశాంత్ కి పోటీ ఎవరూ లేరు. ఒలంపిక్స్ గేమ్స్ ఆడాల్సిన వ్యక్తి పల్లవి ప్రశాంత్ అని, అతనికి అంత రేంజ్ ఉందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పల్లవి ప్రశాంత్ ఆడిన తీరు అలా అనిపిస్తుంది.
పల్లవి ప్రశాంత్ ఆట తీరుకు నిదర్శనంగా ఈ సంఘటనను చెప్పుకోవచ్చు. టికెట్ టు ఫినాలే టాస్కులలో భాగంగా సొరంగంలో నిండిన ఇసుకను మొత్తం బయటకు తీసి, అందులో నుంచి బయటకు వచ్చి కాళ్లకు తగిలించిన తాళంని తీసుకొని మళ్లీ ఆ సొరంగం నుండి వెళ్లి గంట కొట్టాలి.. ఈ టాస్కును పల్లవి ప్రశాంత్ కేవలం రెండే రెండు నిమిషాల్లో పూర్తి చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆట తీరు, ఆయనలోని ప్రతిభను చూస్తే అభిమానులే కాదు ప్రేక్షకులు అందరూ నోరెళ్లబెట్టడం ఖాయం.
ఒలింపిక్స్ లో ఆడే క్రీడాకారులు కూడా పల్లవి ప్రశాంత్ తరహాలో ఆడలేరు. అలా రెండు నిమిషాల వ్యవధిలో అటువంటి టాస్క్ లను పూర్తి చేయలేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పల్లవి కిశోర్ ఈ విధంగా ఆడటం ఇదేమీ మొదటి సారి కాదు.. గతంలోనూ ఓ ఫజిల్ టాస్క్ ను కేవలం 27 సెకండ్స్ లో పూర్తి చేశారు.. అప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ ఆట తీరుకు జనాలందరూ ఫిదా అయ్యారు.. ఈ క్రమంలోనే ఆయనను ఒలంపిక్స్ కు పంపితే మాత్రం మన ఏపీ తరపున ఇండియాకి గోల్డ్ మెడల్ సాధిస్తాడని మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు..