Hyper Aadi: హైపర్ ఆది.. జబర్దస్త్ లో బాగా పేరుగాంచిన వ్యక్తి అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఎంతో కష్టపడి బుల్లితెరపై రాణించిన టాప్ మోస్ట్ కమెడియన్.. అంతేకాదు జబర్దస్త్ వంటి ప్రొగ్రాంలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న హైపర్ ఆది ఇప్పుడు వెండితెరపై కూడా రాణిస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కమెడియన్ అంటే హైపర్ ఆది పేరు వినిపిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంతగా పేరు సంపాదించారనేది. జబర్దస్త్ ప్రొగ్రాంలోని ఓ టీమ్ లో కంటెస్టెంట్ గా వచ్చిన హైపర్ ఆది ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయనకున్న టైమింగ్, కామెడీని చూసి మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ ఆయనను టీం లీడర్ ని చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన టాలెంట్ ఎలాంటిందోనని.. టీం లీడర్ అయ్యాక హైపర్ ఆది స్కిట్స్ బ్లాక్ బస్టర్ సాధించడంతో ఆయన క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అంతేకాదు హైపర్ ఆది లేకపోతే ఎంటర్ టైన్ మెంట్ ఉండదనే ఫీలింగ్ వస్తుంది జనాలకు.. అలాగే ఆయన గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి.. అవేంటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన హైపర్ ఆది ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందులు, సంఘటనలను చెప్పారు. హైపర్ ఆది చిన్నతనం నుంచి చదువులో ముందుడేవారంట. ఈ క్రమంలోనే పదో తరగతిలో 545 మార్కులు, ఇంటర్ లో 950 మార్కులు సాధించానన్నారు. అలాగే బీటెక్ చదివానన్న హైపర్ ఆది 85 శాతం మార్కులను సాధించినట్లు తెలిపారు. ఇవన్నీ చూపించి తనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని కోరానని చెప్పారు. ఇందుకోసం ఆయన ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు దగ్గరకు వెళ్లగా.. ఈ రేంజ్ మార్కులు వచ్చిన వాళ్లు సినిమాల్లో పని చెయ్యడం ఏమిటి? వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకో అన్నారని తెలిపారు.
ఆ తరువాత కొన్నేళ్లకు మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ నడుపుతున్న జబర్దస్త్ షోలో పాల్గొనేందుకు మొదటి సారి అవకాశం వచ్చిందని తెలిపారు హైపర్ ఆది. ఈ ప్రోగ్రాంలో పని చేస్తున్న సమయంలోనే హైపర్ ఆదికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అనుభూతి కలిగిందట. తన స్కిట్స్ కి వచ్చిన వ్యూస్ కు తగ్గట్లుగానే పేమెంట్ తీసుకునే వారట. పేమెంట్ విషయంలో ఎప్పుడూ కూడా మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ ఆలస్యం చేయలేదని పేర్కొన్నారు. టైమ్ టూ టైమ్ పేమెంట్ వస్తుండటం తనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఫీలింగ్ ఉండేదని హైపర్ ఆది వ్యాఖ్యానించారు.