కానీ, తమ కలయిక అంటేనే క్రేజీ కాంబినేషన్ కాబట్టి.. ఈ ఇద్దరు కలిసి ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ కి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా పేరే ‘ఎనిమి(Enemy). టైటిల్ లోనే సినిమా ఏమిటో అర్ధం అయిపోతుంది. పైగా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకే, మొదటి నుండి ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుండి ‘పడదే.. పడదే’(Padathe) ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను మాసివ్ టోన్ లో క్లాసిక్ టచ్ ఇచ్చి స్వరపరిచారు. అలాగే ఈ పాటను రాసిన అనంత్ శ్రీరామ్ కూడా ‘అదిరే నిను చూసే కనులే నీ స్నేహం కోసం కదిలే ..’ అంటూ చక్కని సాహిత్యాన్ని అందించాడు.
ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియుల్ని బాగా అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ పాటలో విశాల్, మృణాలిని రవి మధ్య కెమిస్ట్రీ హైలైట్ అయింది. ఈ చిత్రంలో మృణాళిని రవితో పాటు మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటించింది. అదే విధంగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అన్నట్టు ప్రకాష్ రాజ్ ఇటివలే గాయపడింది ఈ సినిమా సెట్స్ లోనే. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.