https://oktelugu.com/

Paagal Collections: షాకింగ్ గా విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీ కలెక్షన్లు

తొడగొట్టి మరీ తన మూవీ హిట్ అవుతుందని.. హిట్ కాకుంటే సినిమాలు చేయనని ప్రీరిలీజ్ లో వీరావేశంతో డైలాగులు పేల్చాడు హీరో విశ్వక్ సేన్. ఈ యంగ్ రెబల్ హీరో నటించిన ‘పాగల్’ మూవీ తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో ఈ కలెక్షన్లు ఎన్ని వచ్చాయన్నది హాట్ టాపిక్ గా మారింది. తొలి రోజు శనివారం మంచి వసూళ్లను నమోదు చేయడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నట్టు కనిపించాయి. అయితే విశ్వక్ సేన్ కెరీర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2021 / 02:41 PM IST
    Follow us on

    తొడగొట్టి మరీ తన మూవీ హిట్ అవుతుందని.. హిట్ కాకుంటే సినిమాలు చేయనని ప్రీరిలీజ్ లో వీరావేశంతో డైలాగులు పేల్చాడు హీరో విశ్వక్ సేన్. ఈ యంగ్ రెబల్ హీరో నటించిన ‘పాగల్’ మూవీ తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో ఈ కలెక్షన్లు ఎన్ని వచ్చాయన్నది హాట్ టాపిక్ గా మారింది.

    తొలి రోజు శనివారం మంచి వసూళ్లను నమోదు చేయడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నట్టు కనిపించాయి. అయితే విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.

    పాగల్ సినిమా బడా నిర్మాత దిల్ రాజ్ రిలీజ్ చేయడంతో హైప్ వచ్చింది. తొలిసారి మంచి బిజినెస్ జరిగింది. రిలీజ్కు ముందే ఈ చిత్రం పాజిటివ్ టాక్ నుసొంతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట..

    కరోనా సెకండ్ వేవ్ భయాలతో జనాలు థియేటర్లలోకి సరిగా రావడం లేదు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40శాతం మాత్రమే ఈ చిత్రానికి ఆక్యూపెన్సీ రేషియోలో జనాలు వచ్చారు.

    పాగల్ చిత్రం తొలిరోజు కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్లు నికర వసూళ్లు సాధించింది. రాయలసీమ సీడెడ్ లో 21 లక్షలు, పశ్చిమ గోదావరి 4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.8లక్షలు, గుంటూరు రూ.10లక్షలు, కృష్ణ 4.3 లక్షలు, నెల్లూరు 3.1 లక్షలు వసూలు చేసింది. తెలంగాణ, ఏపీ కలిపి రూ.1.30 కోట్ల నికర వసూళ్లు సాధించింది.

    పాగల్ చిత్రం రెండో రోజున రూ.2.50 కోట్ల గ్రాస్ వూళ్లను సాధించింది. ఇక 6.75 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీసు బరిలో నిలిచిన ఈ చిత్రం రెండు రోజుల్లో 5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.3 కోట్ల నికర వసూళ్లు సాధించింది. వారంలో ఇలానే నడిస్తే సినిమా లాభాల్లోకి రావడం ఖాయమని చెబుతున్నారు. వారాంతం వరకు టార్గెట్ రీచ్ కావచ్చని అంటున్నారు.