బీటెక్ దళిత విద్యార్థిని రమ్య హత్య ఏపీలో కలలకం రేపుతోంది. ఇది క్రమంగా రాజకీయ రూపు సంతరించుకుంటోంది. తాజాగా టీడీపీ దీనిపై ఆందోళనకు దిగింది. నారా లోకేష్ స్వయంగా బాధిత కుటుంబం ఇంటికి వచ్చారు. వైసీపీ నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏపీలో మహిళల రక్షణ కోసం తెచ్చిన దిశ చట్టం ఏమైందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేత నారా లోకేస్ గుంటూరులోని పరమయ్యగుంట వద్దకు రాగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. రాజకీయ లబ్ధి కోసం లోకేష్ వచ్చారంటూ వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట ఘర్షణ చోటుచేసుకుంది. పోటా పోటీ నినాదాలతో ఆరోపించుకున్నారు.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎలాంటి అవాంచనీయ సంగటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పరిస్థితులు చేయిదాటి పోవడంతో పోలీసులు నారా లోకేష్ తోపాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే దూళిపాల్ల నరేంద్రనుఅరెస్ట్ చేశారు. నేతలను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు.
అంతకుముందు రమ్య కుటుంబాన్ని నారా లోకేశ్ పరామర్శించారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.ఇక టీడీపీ నేతలను బలవంతంగా పోలీసులు లాక్కెళ్లడంతో పలువురు టీడీపీ నేతలు కిందపడ్డారు. పోలీసుల తీరుపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో హత్యకు గురైన రమ్య ఇంటివద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.