https://oktelugu.com/

Akhanda: ఓవర్సీస్​లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిపోతున్న ‘అఖండ’

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు వీరిద్దరు. ఇక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 11:31 AM IST
    Follow us on

    Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు వీరిద్దరు. ఇక తన మ్యూజిక్ తో తమన్ థియేటర్లలో మోత మొగిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది.

    Akhanda

    విడుదలైన తొలిరోజే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఇదే తరహాలో వరుసగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తోంది. కాగా, బాలయ్య సినిమాకు చిన్నా, పెద్దా, ముసలి, ముతక అనే తేడా లేకుడా ప్రతి ఒక్కరూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. బాలయ్య కనిపించగానే.. ఈలలు, గోలలతో అభిమానాన్ని చాటుతున్నారు.

    Also Read: త్వరలోనే నందమూరి బాలయ్య “రామయ్య”గా రానున్నాడా…

    మరోవైపు విదేశాల్లోనే అఖండ దూసుకెళ్లిపోతోంది. ఓవర్​సీస్​లోనూ ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. అణెరికాలో ఈ సినిమా హాఫ్​ మిలియన్​ డాలర్ల మార్క్​ను చేరుకుంది. 2021లో ఓ తెలుగు సినిమాకు ఈ తరహా కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. ఇదే జోరు కనసాగితే.. వీకెండ్​లో వన్​ మిలియన్ డాలర్లను క్రాజ్​ చేయడం గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు.

    ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించగా.. శ్రీకాంత్​, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.

    Also Read: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా రానున్న… సూపర్ స్టార్ మహేశ్ బాబు