Site icon OkTelugu

Adityadhar targets Bollywood film industry: ఆదిత్యధర్ కు అక్కడే మండింది.. ఏకంగా బాలీవుడ్ నే టార్గెట్ చేశాడు!

Adityadhar targets Bollywood film industry

Adityadhar targets Bollywood film industry

Adityadhar targets Bollywood film industry: ఎదురీత ఎప్పుడు మొదలవుతుంది.. తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమవుతుంది.. జస్ట్ అణచివేత ఆరంభమైనప్పుడే పైవన్నీ జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఉద్యమాలు మొత్తం అణచివేత నుంచి మొదలయ్యాయి. చివరికి హక్కుల సాధన వరకు అవి వెళ్ళాయి. వ్యవస్థ ను అణచివేస్తే ఉద్యమం పుడుతుంది. అదే వ్యక్తి నుంచి వేస్తే తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటు అనేక రూపాలను సంతరించుకొని.. చివరికి ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉంటుంది.

బాలీవుడ్ లో కూడా ఇదే జరిగింది. అందువల్లే ఆదిత్యధర్ అనే వ్యక్తి పుట్టాడు. తనకు ఎదురైన అణచివేతను.. తాను ఎదుర్కొన్న వివక్షను అతడు ఎలుగెత్తాడు. ధిక్కార స్వరాన్ని వినిపించాడు. చివరికి బాలీవుడ్ వెన్ను విరిచి.. సరికొత్త శక్తిగా అవతరించాడు. సినిమా భాషలోనే చెప్పాలంటే.. బాక్సాఫీస్ కు మొగుడిగా నిలిచాడు.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే కాదు.. ప్రపంచ సినిమా చరిత్రలోనే దురంధర్ 2 ఓ సరికొత్త అధ్యాయం. కుహానా సెక్యులర్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ నిజమైన జాతీయత భావాన్ని కలిగిన వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అందువల్లే కదా ఈ సినిమా ఈ స్థాయిలో రికార్డులను సృష్టిస్తున్నది.. ఇది కొంతమందికి కంటగింపుగా మారింది. ఆదిత్య ధర్ ను వారు విమర్శించడానికి కారణం కూడా అదే. అయితే ఆదిత్య ఈ స్థాయిలో బాలీవుడ్ మీద యుద్ధం ప్రకటించడానికి.. నిరసన స్వరం వ్యక్తం చేయడానికి ఓ బలమైన కారణం ఉంది.

కరోనా సమయంలోనే ఆదిత్య నటి యామి గౌతమ్ ను వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు ఒక సంఘటన జరిగింది. బాలీవుడ్ లో పేరుపొందిన డిజైనర్ ఒకతను ఉన్నారు. ఆయన అంబానీ.. ఖాన్, కపూర్, ఇంకా హై ప్రొఫైల్ ఫ్యామిలీ లకు డిజైనర్ గా వ్యవహరిస్తుంటాడు. పెళ్లి దుస్తులను మొత్తం తన రూపొందిస్తాడు. అయితే యామి గౌతమ్ అతడిని సంప్రదించింది. తన పెళ్లి దుస్తులు డిజైన్ చేయాలని కోరింది. అప్పటిక ఆర్టికల్ 370 సినిమా రిలీజ్ కాలేదు. విక్కీ డోర్, ఉరి, మాత్రమే రిలీజ్ అయ్యాయి. యామి గౌతమ్ కు మంచి పేరుని తీసుకొచ్చాయి.. యామి గౌతమ్ దుస్తులు డిజైన్ చేయాలని అడిగితే.. ఆ డిజైనర్.. తలతిక్క సమాధానం చెప్పాడు.

Also Read: నాగార్జున సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయబోతున్న నాగ చైతన్య… డైరెక్టర్ ఎవరంటే..?

“నేను రూపొందించే డిజైన్లు ఎలైట్ పీపుల్ కోసం. నువ్వు ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు. నేను డిజైన్ చేసే లెహంగా నీకు సూట్ కాదు” అని వ్యాఖ్యానించాడు.. ఈ విషయాన్ని యామి గౌతమ్ తన భర్తతో పంచుకుంది. ఆ తర్వాత ఏం చేయాలో కూడా అతడికి. ఆమె చెప్పిన మాటలను అతడు సమర్ధించాడు.. ఇక యామి గౌతమ్ ఆ డిజైనర్ దుస్తులను వేసుకోవడం సరికాదని భావించింది. సంప్రదాయ దుస్తులను ధరించాలని నిర్ణయించుకుంది. తన తల్లి పెళ్లి చేసుకున్న సమయంలో ధరించిన చీరకు కొన్ని మార్పులు చేసింది. దానికి సంప్రదాయ హిమాచలి హంగులు అద్దింది. హిమాచల్ సాంస్కృతికి తగ్గట్టుగా నగలు కూడా ధరించింది. ఆదిత్య కాశ్మీరీ పండిట్.. తను అలాగే పండిట్ దుస్తులలో వచ్చాడు.. వివాహం తర్వాత ఆదిత్య తన మెదడుకు పని చెప్పాడు. గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. బాలీవుడ్ పొగరును తల దించుకునేలా చేసాడు.

ఆదిత్య కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంగనా రనోత్ అండగా నిలిచింది. ఆమె ఇచ్చిన సపోర్ట్ తో ఆదిత్య బాలీవుడ్ పీఠం మీద ఇప్పుడు జెండా ఎగరేశాడు. ఎవరైతే తన భార్యకు దుస్తులు రూపొందించేది లేదనే చెప్పారో.. ఏ బాలీవుడ్ అయితే తనను ఇబ్బంది పెట్టిందో.. ఇప్పుడు అదే డిజైనర్ దుస్తువులు రూపొందించడానికి ఎదురుచూసే విధంగా చేశాడు. బాలీవుడ్ తన పేరు చెబితేనే వణికే స్థాయికి చేరుకున్నాడు. ఆదిత్య.. ఈ పేరు మూడు అక్షరాలు మాత్రమే కావచ్చు. ఈ పేరును బాలీవుడ్ చాలా సంవత్సరాలు పాటు గుర్తుపెట్టుకుంటుంది.

Exit mobile version