Bheemla Nayak: భీమ్లానాయక్​లో పవన్​ గాత్రం.. రికార్డింగ్​ పూర్తిచేసుకున్న పవర్​స్టార్​?

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో సూపర్ ఐ‌టి గా నిలిచిన “అయ్యప్పనుమ్ కోషీయం” సినిమాకు రీమేక్ గా ఈ మూవీ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 4, 2021 11:21 am
Follow us on

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో సూపర్ ఐ‌టి గా నిలిచిన “అయ్యప్పనుమ్ కోషీయం” సినిమాకు రీమేక్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు  చేపట్టడం విశేషం. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.

తాజాగా అడవి తల్లి టైటిల్​తో మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. భీమ్లా నాయక్ సోల్ గా ఈ సాంగ్ ను అభివర్ణిస్తున్నారు. సినిమా కధాంశాన్ని ఈ పాటలో చూపించేశారు. ముఖ్యంగా లిరిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.

కాగా, మరోవైపు ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పాట పాడాడని గతంలో టాక్​ వచ్చింది. అయితే, తాజాగా ఆ పాటన రికార్డింగ్​ను పవన్​ కళ్యాణ్​ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ పాట పక్కా మాస్​ బీట్​తో సాగనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.