Site icon OkTelugu

IPL 2026 Sunrisers Hyderabad struggles: సన్ రైజర్స్ చుట్టూ దరిద్రం.. ఇన్ని షాక్ లు ఏంటి భయ్యా అసలు!

IPL 2026 Sunrisers Hyderabad struggles

IPL 2026 Sunrisers Hyderabad struggles

IPL 2026 Sunrisers Hyderabad struggles: ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో హైదరాబాద్ ఒకటి. 2024 సీజన్లో హైదరాబాద్ జట్టు ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళిపోయింది. కోల్ కతా చేతిలో దరిద్రం కొద్దీ ఓడిపోయింది. మరోసారి ట్రోఫీ అందుకోలేకపోయింది. ఇక 2025 లో అయితే సరిగా ఆడలేకపోయింది. ఈసారి మెరుగైన ప్లేయర్లను హైదరాబాద్ జట్టు తీసుకుంది. సంచలన ఆట తీరుతో ఆకట్టుకోవాలని భావిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. హైదరాబాద్ చుట్టు దరిద్రం ఇప్పుడు తాండవిస్తోంది.

బ్యాటింగ్ పరంగా హైదరాబాద్ జట్టుకు పెద్దగా ఇబ్బంది లేదు. అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి… ఇలా బలమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా కూడా విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేయగలుగుతారు. 2024 సీజన్లో హైదరాబాద్ జట్టు ఐపిఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ చేసింది అంటే ప్రధాన కారణం వీళ్లే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. పైగా ఈసారి మైదానంలో వారు తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే 300 లోడింగ్ అని అభిమానులు అంచనా వేస్తున్నారు.

బ్యాటింగ్ పరంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. బౌలింగ్లో హైదరాబాద్ జట్టు తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటోంది. గత సీజన్లో దారుణమైన బౌలింగ్ వల్ల హైదరాబాద్ ఓటములను ఎదుర్కొంది. దీంతో హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈసారి బౌలింగ్ విషయంలో కాస్త కసరత్తు చేసింది. అయితే మేనేజ్మెంట్ ఒక విధంగా ఆలోచిస్తే.. ఫీల్డ్ లెవల్ లో మరొకటి జరుగుతోంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టులో కమిన్స్ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ప్రారంభ మ్యాచ్ లలో అతడు జుట్టుకు దూరంగా ఉంటాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. కమిన్స్ ఎప్పుడు జట్టులోకి వస్తాడు? ఎప్పుడు ఆడతాడు? అనే విషయాలపై ఇంతవరకు క్లారిటీ లేదు. దీనిపై మేనేజ్మెంట్ కూడా ఒక స్పష్టత ఇవ్వడం లేదు.

కమిన్స్ ప్రారంభ మ్యాచ్లకు దూరమైనప్పటికీ.. అతడి స్థానంలో జాక్ ఎడ్వర్డ్స్ ఆడతాడని.. అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అతడు కూడా గాయపడ్డాడు. ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. ఒకరకంగా ఇది హైదరాబాద్ జట్టుకు కోలు కోలేని షాక్. ఈ పరిణామం నుంచి జట్టును కాస్త లో కాస్త గట్టెక్కించే సామర్థ్యం ఇషాన్ మలింగకు ఉండేది. అయితే అతడు కూడా గాయపడిన నేపథ్యంలో.. హైదరాబాద్ జట్టు పరిస్థితి దారుణంగా మారిపోయింది.

ఐపీఎల్ లో ప్లాట్ మైదానాలు ఉంటాయి. బౌలర్లు శక్తివంచన లేకుండా బంతులు వేస్తేనే పరుగుల వరదను ఆపడం కష్టం. అలాంటిది ఎటువంటి అనుభవం లేని బౌలర్లతో బౌలింగ్ వేయిస్తే.. ప్రత్యర్థి ఆటగాళ్లు పండగ చేసుకుంటారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒకవేళ హైదరాబాద్ బౌలింగ్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తేనే ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రేక్షకుల్లాగా చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Exit mobile version