Survey: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాాదాపు రెండున్నరేళ్లు కావొస్తుంది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలవుతున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు తెచ్చుకుందంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి ఘనతే అని చెప్పొచ్చు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందే ఏపీ అప్పుల ఊబిలో కురుకపోయింది. అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కరోనా లాంటి కష్ట సమయంలోనూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు నిలిపివేసిన దాఖలులేవు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఎన్నిక జరిగిన సీఎం జగన్ కే ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలో వైసీపీ ఎంత బలంగా ఉందో అని చెప్పడానికి ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే దాదాపు క్లీప్ చేసింది. అక్కడక్కడ టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని స్థానాలు దక్కించుకొని పరువు నిలుపుకున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇండియా టుడే దేశ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించించి వివరాలను తాజాాగా వెల్లడించింది.
ఇన్ క్లూజివ్ గ్రోత్ సాధించిన రాష్ట్రాల్లో ఏపీ తొలిస్థానంలో నిలిచిందని ఇండియా టుడే పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇండియా టుడే ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్’ పేరిట నిర్వహించిన సర్వేలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది ఇదే రంగంలో ఏపీ ఏడో స్థానంలో ఉండగా ఇప్పుడు తొలిస్థానంలో నిలువడం విశేషం.
Also Read: కేంద్రపథకాలు.. జగనన్న పేర్లు..ఏంటిది?
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలోనూ జగన్ సర్కారు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు, ఇంటింటికి రేషన్, పింఛను వంటివి పకడ్బంధీగా అమలు చేసింది. ఈ కారణంగానే ఆంధప్రదేశ్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో తొలి స్థానం సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ Survey రిపోర్టు బయటికి రావడంతో వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకుగాను ఇండియా టుడే సర్వేను వాడుకోవాలని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం దీనిని కౌంటర్ చేసేందుకు అన్ని అస్త్రాలు రెడీ చేసుకుంటుండటంతో మరోసారి ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఏదిఏమైనా ఏపీ గ్రామీణాభివృద్ధి నెంబర్ వన్ స్థానం దక్కించుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చంద్రబాబు, కేసీఆర్ ది ఒక రూటు.. జగన్ ది మరో రూటు?