Akhanda 2 advance bookings: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ లో ఎన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ, అఖండ చిత్రం ఎంతో స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో కెరీర్ చివరి దశకు వచ్చేసింది, ఇక బాలయ్య సపోర్టింగ్ రోల్స్ చేసుకోవాల్సిందే అనే స్థాయిలో మార్కెట్ పడిపోయినప్పుడు వచ్చిన చిత్రమిది. కరోనా లాక్ డౌన్ తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమా కావడం తో ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు ఎగబడ్డారు. ఫలితంగా టికెట్ రేట్స్ లేకపోయినప్పటికీ కూడా ఈ చిత్రానికి అప్పట్లోనే 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. డిసెంబర్ 5 న విడుదలైన ఈ సినిమా సంక్రాంతికి వరకు థియేటర్స్ లో నిలబడింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఊహించగలం. కానీ ‘అఖండ 2′(Akhanda Thandavam Movie) కి ఆడియన్స్ లో పెద్దగా క్రేజ్ లేదని అర్థం అవుతోంది.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి ట్రేడ్ నుండి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి, కానీ దానికి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జరగడం లేదు. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై 10 రోజులు దాటింది. ఈ సినిమా విడుదలకు నేటి నుండి సరిగ్గా 18 రోజుల సమయం ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 50 వేల డాలర్లు మాత్రమే వచ్చాయట. ఒక సీక్వెల్ కి ఉండాల్సిన కలెక్షన్స్ కాదు ఇవి. 2021 వ సమయానికి 2025 కి ఆడియన్స్ మైండ్ సెట్ మారడం వల్లనో ఏమో తెలియదు కానీ, నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్స్ నుండి రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబడుతుందని అనుకున్న ‘అఖండ 2’ కనీసం ‘డాకు మహారాజ్’ చిత్రానికి వచ్చినంత ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ అయినా వస్తుందా లేదా అనే డైలమా లో పడినట్టు తెలుస్తోంది.
‘డాకు మహారాజ్’ చిత్రానికి USA ప్రీమియర్స్ నుండి 3 లక్షల 50 వేల డాలర్లు మాత్రమే వచ్చింది. ‘అఖండ 2’ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే నాలుగు లక్షల డాలర్లకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ వచ్చేలా కనిపించడం లేదు. పైగా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడమే కాకుండా, 3D వెర్షన్ లోకి కూడా మార్చి విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అలాంటి సినిమాకు ఇలాంటి ట్రెండ్ ఉండడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, చెడె ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
#Akhanda2 USA Premiere Advance Sales:
$50,596 – 173 Locations – 450 Shows – 1776 Tickets
Slow trend continues. Currently trending similar to Daaku. 18 Days Till Premieres! pic.twitter.com/SG95H2haHR
— Venky Box Office (@Venky_BO) November 17, 2025