Balakrishna comments on Pawan Kalyan: సంచలనాలకు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉంటారు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna). ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఒక్కోసారి వివాదాస్పదం అవుతుంటాయి. మొన్న ఆ మధ్యన అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడిందని.. మెగాస్టార్ చొరవ వల్ల జగన్ వెనక్కి తగ్గారని బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించగా బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. వాడు ఒక సైకో గాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని అభివర్ణిస్తూ.. చిరంజీవిని మధ్యలో తేస్తూ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై చిరంజీవి ప్రత్యేక ప్రకటన విడుదల చేయడంతో దుమారం రేగింది. నందమూరి బాలకృష్ణ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం ద్వారా ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. మరోసారి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ.
ప్రారంభం నుంచి పోటీ..
సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు తర్వాత బాలకృష్ణ ఆ కుటుంబ హీరోగా ఉన్నారు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) చిత్ర పరిశ్రమలో తనకంటూ ముద్ర చాటుకున్నారు. సినిమా పరంగా చిరంజీవితో బాలకృష్ణ పోటీ కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో అనేక గాసిప్స్, వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఏపీలో అధికారంలోకి రాగలిగారు. తద్వారా మెగా కుటుంబమంతా టిడిపికి అనుకూలంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో సీఎం చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ మెగా ఫ్యామిలీ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా పవన్ పై అనుకూల వ్యాఖ్యలు చేశారు.
హిందూపురంలో కామెంట్స్..
హిందూపురం( Hindu Puram ) పర్యటనలో ఉన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో.. తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని బాలకృష్ణ ప్రకటించగా.. టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ హర్షద్వానాలు చేశారు. బాలకృష్ణ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అసెంబ్లీలో సైతం బాలకృష్ణ చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయనపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఎవరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి అప్పట్లో లెక్క చేయలేదని అర్థం వచ్చేలా మాట్లాడారు. దానికి ప్రత్యర్ధులు వక్ర భాష్యం చెప్పారు. అయితే ఈ విషయంలో బాలకృష్ణను క్షమాపణ కోరాలని మెగా అభిమానులు కోరారు. కానీ అటువంటిది చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు అని సంబోధించడం ద్వారా మెగా అభిమానులను కూల్చేశారు నందమూరి బాలకృష్ణ.
