Virupaksha OTT Streaming : సమ్మర్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ట్రేడ్ కి ‘విరూపాక్ష’ అనే చిత్రం జాక్పాట్ లాగ తగిలింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.మన టాలీవుడ్ లో హారర్ జానర్ సినిమాలు విడుదలై చాలా కాలం అయ్యింది.మొన్నీమధ్యనే ‘మసూద’ అనే హారర్ చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది కానీ, కాస్త పేరున్న హీరోలు ఈ జానర్ ని చెయ్యడం మానేశారు.
అలాంటి సమయం లో వచ్చిన ‘విరూపాక్ష’ చిత్రం ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ అనుభూతి రప్పించడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ని సృష్టించింది.ఇప్పటి వరకు ఈ చిత్రం 40 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసింది, త్వరలోనే మీడియం రేంజ్ హీరోలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన 50 కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకోబోతుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది, అదేమిటంటే ఈ చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.అయితే మే 20 దాటినా కూడా ఈ చిత్రానికి అదిరిపొయ్యే రేంజ్ బాక్స్ ఆఫీస్ రన్ వచ్చేలాగా కనిపిస్తుంది.ట్రెండ్ అంత సాలిడ్ గా ఉందిమరి.
ఇలాంటి చిత్రాలను కచ్చితంగా థియేటర్స్ లో చూసినప్పుడే అసలే థ్రిల్లింగ్ అనుభూతి కలుగుతుంది.పైగా ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దగ్గర్లో పెద్ద హీరో సినిమాలేవీ కూడా లేదు, అందుకే ఈ చిత్రానికి డ్రీం లాంగ్ రన్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.