Dhurandhar 2 Ott Release: గత ఏడాది డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మూవీ లవర్స్ ‘ధురంధర్’ మేనియా లో మునిగి తేలుతున్నారు. మొదటి భాగం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి దాదాపుగా 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఫిబ్రవరి నెలలో ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయగా, అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. థియేటర్స్ లో ఈ చిత్రానికి ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో , ఓటీటీ లో అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం మే 19 న ఉగాది / రంజాన్ పురస్కరించుకొని భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఓపెనింగ్స్ లో సునామీ ని సృష్టించిన ఈ చిత్రం, మొదటి 11 రోజులు సెన్సేషనల్ ట్రెండ్ ని చూపించింది.
అదే ట్రెండ్ కొనసాగి ఉండుంటే ఈ సినిమా వసూళ్లు 2500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా దాటి ఉండేది. కానీ 12 వ రోజున నుండి వసూళ్లు బాగా తగ్గిపోయాయి. కానీ స్టడీ రన్ ఉండడం వల్ల , ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 1810 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తూనే ఉంది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 2 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రెండు నెలకే క్రితం విడుదలైన మూవీ ఇప్పటికీ బుక్ మై షో యాప్ లో ట్రెండ్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సమయం వచ్చేసింది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రం ఈ నెల 14 న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని నిర్మించింది జియో స్టూడియోస్ అనే సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భాగాన్ని కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ రెండవ భాగానికి దాదాపుగా 250 కోట్ల రూపాయిల ఆఫర్ ని ఇచ్చింది. కానీ జియో సంస్థ అమ్మెందుకు నిరాకరించింది. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాలను స్వయంగా తాము మాత్రమే పొందాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తమ సంస్థల్లో ఒకటైన హాట్ స్టార్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు తో పాటు , హిందీ, తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం ఈ నెల 14 నుండి అందుబాటులోకి రానుంది.