Homeఎంటర్టైన్మెంట్ఓటీటీTillu Square OTT: బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ ఓటీటీలో... డేట్ ఫిక్స్.. ఎందులో అంటే?

Tillu Square OTT: బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ ఓటీటీలో… డేట్ ఫిక్స్.. ఎందులో అంటే?

Tillu Square OTT: 2024లో చిన్న చిత్రాలు సంచలనం చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేని హనుమాన్ సంక్రాంతి బరిలో దిగి విన్నర్ గా నిలిచింది. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి బడా స్టార్స్ కి షాక్ ఇస్తూ హనుమాన్ అత్యధిక వసూళ్లు రాబట్టింది. అదే కోవలోకి వస్తుంది టిల్లు స్క్వేర్. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 125 కోట్ల వసూళ్లు రాబట్టింది. సిద్ధూ జొన్నలగడ్డ చిత్రానికి వంద కోట్లు అంటే ఊహించని పరిమాణం.

సిద్ధూ జొన్నలగడ్డ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది ఈ చిత్రం. టైర్ టు హీరోల జాబితాలో టాప్ లో సిద్ధూ చేరాడు. సమ్మర్ కానుకగా మార్చి 29న టిల్లు స్క్వేర్ విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. యువత ఈ మూవీ పట్ల ఆసక్తి చూపారు. వాళ్ళ అంచనాలు అందుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది.

సిద్ధూ వన్ మ్యాన్ షోతో మరోసారి ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచాడు. అలాగే అనుపమ పరమేశ్వరన్ తన ఇమేజ్ బ్రేక్ చేస్తూ గ్లామరస్ రోల్ చేసింది. ముద్దు సన్నివేశాల్లో నటించింది. కామెడీ, రొమాన్స్, సస్పెన్సు అంశాలతో చక్కగా తెరకెక్కించారు. యూఎస్ లో టిల్లు స్వేర్ $3 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఇది పెద్ద హీరోలకు కూడా చాలా కష్టమైన ఫిగర్ అని చెప్పొచ్చు.

కాగా టిల్లు స్క్వేర్ సందడి థియేటర్స్ లో ఇంకా తగ్గలేదు. అయినప్పటికీ ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిల్లు స్క్వేర్ ఓటీటీ హక్కులు ప్ర ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏప్రిల్ 26 నుండి టిల్లు స్క్వేర్ స్ట్రీమ్ కానుందట. టిల్లు స్క్వేర్ మూవీని బుల్లితెర మీద చూసి ఎంజాయ్ చేయడం ఇక మీ వంతు. మాలిక్ రామ్ ఈ చిత్ర దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.

RELATED ARTICLES

Most Popular