TCA
TCA: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఇటీవల వైభవంగా జరిగాయి. గ్రేటర్ టొరంటో నగరంలోని డాంటే అవిగే అకాడమీ, కిప్లింగ్లో నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకల్లో తెలంగాణకు చెందిన సుమారు 1,500 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుప్తేశ్వరి వారుపిల్లి, సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవాని సామల, విజయ చిత్తలూరు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఘనంగా వేడుకలు..
ఇక ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, వ్యవస్థాపకు సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో పూజారి నరసింహాచారి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీరంజని కందూరి, ప్రవళిక మ్యాకల వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. పలువురు పెద్దలు. చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రచించిన చిన్న పిల్లలతో ప్రదర్శించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ నాటిక ప్రేక్షకుల్ని ఆలరింపజేసింది. మనబడి చిన్నారులు ప్రదర్శించిన బుర్రకథకు విశేషాదరణ లభించింది. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటలు ప్రేక్షకులను ఉల్లాసపరిచారు.
టీసీఏ దినపత్రిక ఆవిష్కరణ..
తెలంగాణ కెనడా సంఘం అధికారిక తెలుగు పత్రిక టీసీఎల్ ఉగాది సంచికను విడుదల చేశారు. దీనిని తెలంగాణ కెనడా సంఘం అధికారిక తెలుగు పత్రిక టీసీఏ తృతీయ సంచికను ఉగాది సందర్భంగా ఎన్‌సీపీఐ అధినేత రాంబాబు వాసుపల్లి ఆవిష్కరించి రాంబాబు వాసుపల్లి ఆవిష్కరించి పాలక మండలి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషను ప్రోత్సహిస్తున్న కెనడా సంఘం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. మన మాతృభాష ప్రాముఖ్యత భావితరాలకు తెలియజేసేందుకే ఈ సంచికను ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం ఈ వేడుకలకు హాజరైన అందరికీ ఉగాది పచ్చడితోపాటు భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ugadi celebrations in toronto
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com