RX 100 Movie
RX 100 Movie: సంచలన చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. వాటిలో ఆర్ఎక్స్ 100 ఒకటి. 2018లో విడుదలైన ఈ మూవీ కుర్రాళ్లను ఊపేసింది. యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రంతో హీరోగా మారాడు. అలాగే సీరియల్ నటిగా ఉన్న పాయల్ రాజ్ పుత్ ని అజయ్ భూపతి హీరోగా చేశాడు. హీరో కార్తికేయకు ఇది రెండో చిత్రం. 2017లో విడుదలైన ప్రేమతో మీ కార్తీక్ అనే మూవీతో కార్తికేయ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.
ఈ మూవీ విలేజ్ ట్రాజిక్ లవ్ డ్రామా. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు అజయ్ భూపతి ఓ సరికొత్త లవ్ స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. 2018 జులై 12న ఆర్ఎక్స్ 100 విడుదలైంది. ఈ మూవీపై ఎలాంటి అంచనాలు లేవు. కేవలం మౌత్ టాక్ తో ప్రచారం దక్కించుకుంది. కార్తికేయ-పాయల్ ఎలాంటి ఫేమ్ లేని హీరో, హీరోయిన్. ఈ చిత్రంలోని ‘మబ్బులోని వాన విల్లులా’ సాంగ్ బాగా పాప్యులర్. ప్రతి చోటా ఈ సాంగ్ వినిపించేది.
ఆర్ఎక్స్ 100 మూవీ భారీ లాభాలు పంచింది. ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ. 2 కోట్లు అని సమాచారం. ఆర్ఎక్స్ 100 రూ. 25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు… ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాతలు, బయ్యర్లు ఏ స్థాయిలో లాభపడ్డారో. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రధాన బలం. క్లైమాక్స్ వరకు హీరోయిన్ క్యారెక్టర్ ఏమిటో ప్రేక్షకులు ఊహించలేరు. చివరిలో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది.
అనేక హిందీ సీరియల్స్ లో నటించిన పాయల్ రాజ్ పుత్ బోల్డ్ రోల్ చేసింది. ఆమె పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ మీద మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించారు. లిప్ లాక్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించారు. కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ప్రేయసి కోసం తపించే పాత్రలో కార్తికేయ సహజంగా నటించాడు. కార్తికేయ సైతం మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.
ఆర్ఎక్స్ 100 మూవీ ఎప్పుడు చూసినా కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ క్రమంలో ఆర్ఎక్స్ 100 ఏ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఉందో తెలుసుకుందాం. ఆర్ఎక్స్ 100 రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆర్ఎక్స్ 100 ఎంవీ చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఆర్ఎక్స్ 100 మూవీ కథ ఏమిటో చూద్దాం.. ఓ గ్రామంలో విశ్వనాథం(రావు రమేష్) పెద్దగా ఉంటారు. ఆయన అనుచరుల్లో శివ(కార్తికేయ) ఒకడు. విశ్వనాథం కూతురు ఇందు(పాయల్ రాజ్ పుత్) ఒకసారి శివను చూస్తుంది. మొదటి చూపులోనే అతడిని ఇష్టపడుతుంది. శివకు దగ్గర అవుతుంది. శివ-ఇందు ప్రేమలో పడతారు. ఈ క్రమంలో శారీరకంగా దగ్గరవుతారు. ఇందు ఊరి నుండి పట్టణం వెళ్ళిపోతుంది. ఆమె గురించి శివకు ఎలాంటి సమాచారం ఉండదు.
ఆమె రాక కోసం పిచ్చోడిలా ఎదురుచూస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఆ గ్రామంలో ఉన్న శివ శత్రువులు అతన్ని అటాక్ చేయాలని చూస్తూ ఉంటారు. అసలు ఇందు శివకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది? శివను ఇందు కలిసిందా? ఇందు గురించి శివకు తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? అనేది కథ. ఈ న్యూ ఏజ్ లవ్ డ్రామా మరోసారి చూసి ఎంజాయ్ చేయండి..
Web Title: Rx 100 movie ott release date
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com