https://oktelugu.com/

Hardik pandya – Natasa Stankovic : హార్దిక్ పాండ్యా విడాకులు.. అందరికీ షాక్.. అందుకే కెప్టెన్సీకి పక్కన పెట్టారా?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా సంచలన విషయం ప్రకటించాడు. తన భార్య నటాషా తో విడాకులు తీసుకున్నట్టు వెల్లడించాడు.."నాలుగేళ్ల ప్రయాణం. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ వేరయ్యాయి. నటాషా నేను తీవ్రంగా చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకనుంచి మా దారులు వేరుగా ఉంటాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 18, 2024 / 10:00 PM IST
    Follow us on

    Hardik pandya – Natasa Stankovic : నాలుగేళ్ల ప్రయాణం.. ఓ కుమారుడు.. ఇన్నేళ్లుగా సాఫీగా సాగిన సంసారం.. ఒక్కసారిగా కుదుపునకు గురైంది. అన్యోన్యంగా పెన వేసుకున్న దాంపత్యం విడిపోయింది. ఎవరి దారి వారిది కావడంతో ఎవరికి వారనేది అనివార్యమైంది. అంతిమంగా విడాకులు అనే పదం ఇద్దరి నోటా వినిపించింది. మీడియాలో వస్తున్న ఊహగానాలకు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.

    సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు

    టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా సంచలన విషయం ప్రకటించాడు. తన భార్య నటాషా తో విడాకులు తీసుకున్నట్టు వెల్లడించాడు..”నాలుగేళ్ల ప్రయాణం. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ వేరయ్యాయి. నటాషా నేను తీవ్రంగా చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకనుంచి మా దారులు వేరుగా ఉంటాయి. ఇది ప్రకటించడం ఒక ఇంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మా వ్యక్తిగత నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉంటారని అనుకుంటున్నాం.. హార్దిక్ / నటాషా” అని ఓ నోట్ ను హార్దిక్ పాండ్యా పోస్ట్ చేశాడు.

    ఒక పార్టీలో కలుసుకున్నారు

    వాస్తవానికి హార్దిక్ కు నటాషా ఒక పార్టీలో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది. కొద్దిరోజులపాటు వారిద్దరూ డేటింగ్ చేశారు. అదే సమయంలో నటాషా గర్బం దాల్చింది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే హార్దిక్ వివాహం చేసుకున్నాడు. వీరికి వివాహమైన మూడు నెలల తర్వాత అగస్త్య జన్మించాడు.. ఆ తర్వాత కొద్ది రోజులపాటు వీరిద్దరి మధ్య దాంపత్యం అన్యోన్యంగా సాగింది. 2022లో గుజరాత్ కెప్టెన్ గా ఐపీఎల్ కప్ సాధించినప్పుడు.. హార్దిక్ పాండ్యాను నటాషా అభినందించింది. ఆ సమయంలో నటాషా, కుమారుడు అగస్త్యతో కలిసి హార్దిక్ సంబరాలు జరుపుకున్నాడు. హార్దిక్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అతడు ఆడే ప్రతి మ్యాచ్ కు నటాషా హాజరైంది. అతడు మైదానంలో ఆడుతున్నప్పుడు ఎంకరేజ్ చేసింది. అయితే ఇటీవలి ఐపిఎల్ నుంచి నటాషా కనిపించలేదు. ముంబై జట్టుకు హార్దిక్ కెప్టెన్ అయినప్పటికీ శుభాకాంక్షలు తెలియజేయలేదు. దీంతో వారిద్దరి దారుడు వేరయ్యాయని మీడియాలో ప్రచారం జరిగింది. దానిపై అటు హార్దిక్, ఇటు నటాషా నోరు మెదపకపోయినప్పటికీ.. వారి పనుల ద్వారా.. అవి నిజమేనని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇద్దరిలో ఎవరూ నోరు మెదపకపోవడంతో.. అవన్నీ ఊహగానాలని కొందరు కొట్టి పారేశారు. అయితే వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియాలో విడాకుల విషయాన్ని ప్రకటించాడు.

    అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదా..

    హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నాడు కాబట్టే.. మానసికంగా ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో బిసిసిఐ.. శ్రీలంక పర్యటనలో హార్థిక్ పాండ్యా కు కెప్టెన్సీ ఇవ్వలేదని తెలుస్తోంది. “ప్రస్తుత పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెంచాలను కోలేదు. టి20 వరల్డ్ కప్ లో అతడు అద్భుతంగా ఆడాడు. టీమిండియా హీరో గా నిలిచాడు. అలాంటి వ్యక్తి వ్యక్తిగత కారణాల వల్ల కాస్త కుదుపున గురవుతున్నాడు. అలాంటి ఆటగాడిపై ఒత్తిడి పెంచడం భావ్యం కాదు. అందుకే అతనిని టీ20 జట్టులోకి తీసుకున్నాం. వన్డే టోర్నికి అతనిని దూరంగా ఉంచాం. ఈ సమయంలో అతడికి మానసిక సాంత్వన కావాలి. అందుకోసమే వన్డే టోర్నికి అతడిని ఎంపిక చేయలేదు. శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియా ఆడే మ్యాచ్లలో హార్దిక్ జాయిన్ అవుతాడని” బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.