Director Avaneendra: డైరెక్టర్ గా ఫెయిల్ అయిన రాజమౌళి శిష్యుడు…కారణం ఏంటి..?

'లవ్ మౌళి' సినిమాతో అవనీంద్ర డైరెక్టర్ గా మారాడు. అయిన కూడా సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే ఈ సినిమాను చాలా థియేటర్ల నుంచి తీసేస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 9, 2024 12:55 pm

Director Avaneendra

Follow us on

Director Avaneendra: దర్శక ధీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే కాకుండా ఆ పరిధిని దాటి పాన్ వరల్డ్ లో సినిమాలను కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి బయటకు వచ్చి సినిమాలు చేసిన ఏ ఒక్క దర్శకుడు కూడా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఇక ఇప్పటికే ద్రోణా సినిమా దర్శకుడైన కరుణ్ కుమార్, దిక్కులు చూడకు రామయ్య మూవీ డైరెక్టర్ అయిన త్రికోటి, లచ్చిందేవికో లెక్కుంది సినిమా డైరెక్టర్ అయిన జగదీష్ తలసిల లాంటి దర్శకులు ఇప్పటికే ఫ్లాప్ డైరెక్టర్లుగా ముద్ర వేయించుకున్నారు.

ఇక ఇప్పుడు ‘లవ్ మౌళి’ సినిమాతో అవనీంద్ర డైరెక్టర్ గా మారాడు. అయిన కూడా సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే ఈ సినిమాను చాలా థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. ఇక దానికి కారణం ఏంటి అనే విషయం పక్కన పెడితే రాజమౌళి దగ్గర నుంచి వచ్చిన మరో దర్శకుడు కూడా ఫెయిల్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వస్తున్నాయి. ఒకపక్క సుకుమార్ దగ్గర నుంచి వచ్చిన దర్శకులందరూ స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకుంటుంటే రాజమౌళి దగ్గర నుంచి వచ్చిన దర్శకులు మాత్రం ఫ్లాప్ డైరెక్టర్లు గా మారడం వెనక కారణం ఏంటి అంటూ చాలామంది చాలా రకాలుగా విమర్శలైతే చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే రాజమౌళి సక్సెస్ అయినంత రేంజ్ లో తన శిష్యులు సక్సెస్ కావడం లేదు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇది ఆయనతో పాటు ఆయన అభిమానులను కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టే అంశం అనే చెప్పాలి. సుకుమార్ శిష్యుల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒక సినిమాని సెట్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేసెంత వరకు ఆయన అందులో ఇన్వాల్వ్ అవుతూ చూసుకుంటూ ఉంటాడు.

అందువల్లే ఆయన శిష్యులు సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక రాజమౌళి దగ్గర ఇది మిస్ అవుతుంది అందువల్లే ఆయన శిష్యులు సక్సెస్ అవడం లేదు అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం రాజమౌళి మీద విమర్శలైతే చేస్తున్నారు…