Robin Hood, 'Mad Square Movies OTT
OTT : ఒకప్పుడు టాలీవుడ్ ని పైరసీ భూతం ఎలా పీడించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీ సంక్షోభం లో పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ అలాంటి రోజులు రావని అనుకున్నాం. కానీ అంతకు మించిన రోజులు వచ్చేసాయి. ఒకప్పుడు పైరసీ జరిగినా థియేటర్ లో రికార్డు చేసిన ప్రింట్లు మాత్రమే ఉండేవి. ఆడియో లో ప్రేక్షకుల అరుపులు, కేకలు కూడా అందులో వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రింట్ బయటకు వస్తుందంటే, ఓటీటీ లో విడుదలయ్యే ప్రింట్లు ఎంతటి క్వాలిటీ తో ఉంటాయో, అలాంటి క్వాలిటీ తో వస్తున్నాయి. ‘గేమ్ చేంజర్’ నుండి ఈ సంస్కృతి మొదలైంది. నిర్మాతలు వీటిని అరికట్టలేకపోతున్నారు. ‘తండేల్’ చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే నిర్మాత బన్నీ వాసు ప్రెస్ మీట్ ని పెట్టి ఆవేదన వ్యక్తం చేసాడు. సినీ ఇండస్ట్రీ కి ఈ సంస్కృతి ఇప్పుడు మహమ్మారి లాగా తయారైంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఉగాది కానుకగా ఈ నెల 28వ తారీఖున ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square), ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు కలిపి విడుదలకు ముందు 50 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మ్యాడ్ స్క్వేర్ కి సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి, ఈ సినిమాపై పైరసీ ప్రభావం చాలా తక్కువగా ఉంది ఉండొచ్చు. కానీ ‘రాబిన్ హుడ్’ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమా పై పైరసీ ప్రభావం చాలా బలంగా పడింది. రెండు రోజులకు కలిపి కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదంటే, పైరసీ ప్రభావం ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు. ‘మ్యాడ్ స్క్వేర్’ మీద కూడా గట్టి ప్రభావమే పడింది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలను థియేటర్స్ కి వెళ్లి ఏమి చూస్తాములే అనే మైండ్ సెట్ తో ఉండే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.
Also Read : సల్మాన్ కెరీర్ లో వరస్ట్ ఓపెనింగ్స్..’సికిందర్’ పరిస్థితి ఇలా ఉందేంటి!
అలాంటి వారికి పైరసీ లో ఈ రేంజ్ క్వాలిటీ ప్రింట్ దొరికితే థియేటర్స్ కి ఎందుకు వెళ్తారు?, ఇంట్లోనే కూర్చొని చూస్తారు. ఫలితంగా కేవలం రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాల్సిన ఈ సినిమాకు మూడు రోజుల సమయం పట్టింది. అంటే నాలుగు కోట్ల రూపాయలకు పైగానే నష్టం. ఫుల్ రన్ లో పది కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘సికిందర్’ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే, ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే ముందే ఆన్లైన్ లో HD క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయిపోయింది. ఎంతటి అన్యాయం ఇది?, భవిష్యత్తులో విడుదల అవ్వబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలకు ఈ పైరసీ భూతం వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని చెప్పొచ్చు.