Sikander Opening Collections
Sikander Movie : బాలీవుడ్ లో టాక్ తో , డైరెక్టర్ తో, హైప్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సల్మాన్ ఖాన్(Salman Khan) మాత్రమే. సుమారుగా 15 ఏళ్ళ వరకు ఓపెనింగ్స్ సల్మాన్ కి పోటీ ని ఇచ్చే హీరోనే దగ్గర్లో లేరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న సల్మాన్ ఖాన్ గడిచిన ఐదేళ్ళలో బాగా తగ్గిపోయాడు. ఆయన సినిమాలకు ఒకప్పుడు ఉన్న ఊపు ఇప్పుడు లేకపోవడం గమనార్హం. కారణం సల్మాన్ నేటి తరం ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు చేయకపోవడం వల్లే. ఈమధ్య కాలం లో కంటెంట్ ఈజ్ ది కింగ్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. విడుదలకు ముందు నుండే కంటెంట్ ప్రేక్షకులను ఆకర్షించాలి. లేకుంటే సల్మాన్ ఖాన్ ని అయినా పట్టించుకోని పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి.
Also Read : ‘రాబిన్ హుడ్’ బ్రేక్ ఈవెన్ అసాధ్యం..2 రోజుల్లో వచ్చింది ఎంతంటే!
ఈరోజు విడుదలైన ‘సికిందర్’ పరిస్థితి అలాగే ఉంది. ఆదివారం రోజున విడుదలయ్యే సినిమాలకు ఓపెనింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో ఉంటాయి. ‘సికిందర్'(Sikindar Movie) కి కూడా అలాంటి ఓపెనింగ్స్ ని ఆశించారు ట్రేడ్ పండితులు. కానీ మొదటి ఆట నుండే దారుణమైన ఫ్లాప్ టాక్ రావడం ఈ సినిమా వసూళ్లపై తీవ్రమైన ప్రభావం చూపించింది. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు 13 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. సల్మాన్ ఖాన్ రేంజ్ కి ఇది డిజాస్టర్ కంటే ఎక్కువ. ఆయన స్థాయి స్టార్ అయినటువంటి షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రానికి గంటకు 86 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా ‘యానిమల్’ చిత్రానికి 80 వేల టిక్కెట్లు, రీసెంట్ గా విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రానికి 61 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సాధారణంగా ఆదివారం రోజున సాయంత్రం షోస్ వేరే లెవెల్ లో ఉంటాయి. కానీ ‘సికిందర్’ కి అక్కడే తగ్గింది. అందుకే ఈ చిత్రాన్ని డిజాస్టర్ అని సంబోదించాల్సి వస్తుంది.
ప్రస్తుతం బుక్ మై షో(Book My Show) ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు దేశవ్యాప్తంగా పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కి మాస్ ప్రాంతాల్లో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలు కలిసొస్తే ఈ 30 కోట్ల రూపాయిల రేంజ్ వరకు ఈ సినిమా వెళ్లొచ్చు. చిన్న చిన్న హీరోలు సైతం కొత్త రకమైన కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చి మొదటి రోజు 40 కోట్లు, 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతున్న ఈరోజుల్లో, సల్మాన్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రావడం అనేది అత్యంత అవమానకరమైన విషయం. మొదటి రోజే ఈ రేంజ్ లో ఉందంటే, ఫుల్ రన్ లో ఈ సినిమా వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టడం కూడా కష్టమే.