https://oktelugu.com/

Project Z: సందీప్ కిషన్ బెస్ట్ మూవీ..కానీ ఓటీటీలోకి రావడానికి ఆరు సంవత్సరాల పట్టిందా?

గతంలో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ త్రిల్లర్ లో ఒకటిగా ఈ సినిమా పేరు సంపాదించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్లను రాబట్టకపోయినా ప్రేక్షకుల నుంచి మాత్రం ప్రశంసలను అందుకుంది ఈ సినిమా.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 1, 2024 / 02:17 PM IST

    Project Z

    Follow us on

    Project Z: డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలి అని అలాంటి వాటికి మాత్రమే సైన్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు సందీప్ కిషన్. అయితే ఈ హీరోగా నటించిన ఒక సినిమా విడుదలైన ఆరు సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఆహా లో రీసెంట్ గా ప్రాజెక్ట్ జెడ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తమిళ్ లో మాయవన్ పేరుతో తెరకెక్కింది. మంచి సస్పెన్స్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతోంది. ఇంతకీ ఈ సినిమా పార్ట్ 1 చూశారా?

    గతంలో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ త్రిల్లర్ లో ఒకటిగా ఈ సినిమా పేరు సంపాదించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద కలెక్షన్లను రాబట్టకపోయినా ప్రేక్షకుల నుంచి మాత్రం ప్రశంసలను అందుకుంది ఈ సినిమా. లావణ్య త్రిపాఠి సినిమాలో హీరోయిన్ గా నటిస్తే సందీప్ కిషన్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా 2017 లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో సందీప్ కిషన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. ఈయనకు పోలీష్ ఆఫీసర్ పాత్ర కొత్త అనే చెప్పాలి.

    హీరో గెటప్ కూడా కొత్తగా అనిపిస్తుంది.ఈ సినిమాకి సివి కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు నలన్ కుమారసామి స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం జిబ్రాన్ వహించారు. సినిమా ఎండింగ్ కూడా ఒక సస్పెన్స్ తోనేఉంటుంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.

    ఈ సినిమాకు సీక్వెల్ ను సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమా ఇప్పటికే హిందీ, తమిళ్ భాషల్లో తెరకెక్కింది. అయితే తెలుగులో మాత్రం సరైన డిజిటల్ రిలీజ్ ఈ సినిమాకి లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ జెడ్ మాత్రం ఆహాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇవాళ నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మీరు థియేటర్ లలో ఈ సినిమా చూడకపోతే ఆహాలో చూసేయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటి.