https://oktelugu.com/

OTT Movies: ఓటీటీ ప్రియులకు పండగే పండగ… సినిమాలు, సిరీస్లతో అదిరిపోయే కంటెంట్ సిద్ధం!

విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న విడుదలైంది. కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 31, 2024 / 02:32 PM IST

    OTT Movies

    Follow us on

    OTT Movies: వీకెండ్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. మంచి సినిమా లేదా సిరీస్ చూసి వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. సినీ లవర్స్ కోసం ఈ వారం కూడా అద్భుతమైన కంటెంట్ సిద్ధంగా ఉంది. వాటిలో క్రేజీ వెబ్ సిరీస్, మూవీస్ ఉన్నాయి. అంతే కాదు మూడు చిన్న సినిమాలు ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.

    విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న విడుదలైంది. కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విలేజ్ పొలిటికల్ డ్రామాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరకెక్కింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే ఆనంద్ దేవరకొండ, ప్రగతి హీరో హీరోయిన్ గా నటిస్తున్న గం గం గణేశా థియేటర్స్ లోకి వచ్చింది. గం గం గణేశా చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కడం విశేషం.

    కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన ‘ భజే వాయువేగం సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయువేగం చిత్రాల్లో విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.

    ఒక ఓటీటీలో కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్లు అలరించేందుకు రెడీ గా ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన చిత్రాలు, సిరీస్లు ఏమిటో చూద్దాం…

    నెట్ ఫ్లిక్స్
    ఏ పార్ట్ యూ స్వీడిష్ సినిమా – మే 31
    రైజింగ్ వాయిసెస్ స్పానిష్ సిరీస్ – మే 31
    లంబర్ జాక్ ది మొంస్టర్ జపనీస్ మూవీ జూన్ 01

    అమెజాన్ ప్రైమ్
    బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ – మే 31

    హాట్ స్టార్
    జిమ్ హెన్సెన్ ఐడియా మ్యాన్ ఇంగ్లీష్ మూవీ – మే 31

    జియో సినిమా
    దేద్ బిగా జమీన్ హిందీ సినిమా – మే 31
    లా అండ్ ఆర్డర్ టొరంటో ఇంగ్లీష్ సిరీస్ – మే 31
    ఎలీన్ ఇంగ్లీష్ సినిమా – జూన్ 01

    జీ 5
    హౌస్ ఆఫ్ లైస్ హిందీ సినిమా – మే 31
    సైనా ప్లే – పాంబలై ఒరుమై మలయాళ సినిమా – మే 31

    ఆహా
    ప్రాజెక్ట్ – జెడ్ – మే 31