Vishwambhara
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవికి సినిమాకి ఓటీటీ కష్టాలా..? నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదూ..?, కానీ నమ్మాలి, అదే నిజం కాబట్టి. ప్రస్తుతం ఆయన ‘భింబిసారా’ ఫేమ్ వశిష్ఠ దర్సకత్వం లో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ టాకీ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యినట్టే. కేవలం కొన్ని షాట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా వేశారు. అయితే గత ఏడాది ఈ చిత్రం టీజర్ ని విడుదల చేయగా, దానికి సోషల్ మీడియా నుండి ఏ రేంజ్ ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ సినిమా అన్నారు?, మరి ఈ అమీర్ పేట్ గ్రాఫిక్స్ ఏమిటి? అంటూ డైరెక్టర్ ని ట్యాగ్ చేసి తిట్టారు. చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న ఫాంటసీ చిత్రమిది, ఇలాగేనా తీసేది అంటూ డైరెక్టర్ ని నిలదీశారు.
సినిమా ఎలాగో వాయిదా పడింది, సోషల్ మీడియా లో వచ్చిన నెగటివ్ ట్రోల్స్ ని పరిగణలోకి తీసుకొని VFX మీద రీ వర్క్ చేయమని మెగాస్టార్ చిరంజీవి మూవీ టీం ని ఆదేశించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీంతో నిర్మాతలు VFX విషయం లో సీరియస్ గా వ్యవహరిస్తూ, కల్కి చిత్రానికి పనిచేసిన కంపెనీ తో రీ వర్క్ చేయిస్తున్నారని టాక్ వినిపించింది. మంచి కంపెనీ కి వెళ్ళింది, ఇక VFX విషయం లో భయపడాల్సిన అవసరం లేదంటూ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదంతా ఫేక్ అని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే ఈ సినిమా మీద యూవీ క్రియేషన్స్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇంకా పెట్టడానికి వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు. అప్పులు భారీగా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. దీంతో నిర్మాతలు ఓటీటీ రైట్స్ మీద ఆధారపడ్డారు.
అడిగిన రేట్స్ కి ఈ డిజిటల్ రైట్స్ అమ్ముడుపోతే, అందులో వచ్చే డబ్బుని VFX కోసం ఉపయోగించొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే నిర్మాతలు 100 కోట్ల రూపాయలకు పైగా డిజిటల్ రైట్స్ ని డిమాండ్ చేస్తున్నారు. కానీ అంత రేట్ కి మాకు వర్కౌట్ అవ్వదు అని తేల్చి చెప్పేశారట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కి 6 మిలియన్ కి పైగా ఓటీటీ నుండి వ్యూస్ వచ్చాయి. 100 కోట్ల రూపాయిల రేంజ్ లో డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవాలంటే, కనీసం 12 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చే రేంజ్ ఉండాలి. చిరంజీవి సినిమాలకు ప్రస్తుతం అంత రేంజ్ లేదు. కాబట్టి 40 నుండి 50 కోట్ల రూపాయిల రేంజ్ లో అమ్మేటట్టు అయితే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఇలా ఇరువైపులా ఎవ్వరూ తగ్గకపోవడం తో ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు అవ్వని పరిస్థితి ఏర్పడింది. ఎటు తేల్చకపోతే ఈ సినిమాకి కూడా ‘అంజి’ కి పట్టిన గతే పడుతుందేమో అని అభిమానులు భయపడుతున్నారు.