Tandel
Tandel : నాగచైతన్య కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’. కార్తికేయ సిరీస్ ని తెరకెక్కించిన చందు మొండేటి దర్శకత్వం లో, నిర్మాత అల్లు అరవింద్ సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రమిది. సినిమా సెట్స్ మీద వెళ్లే ముందు ఎంతో రీసెర్చ్ చేసారు. శ్రీకాకుళం జాలరులతో కలిసి నాగ చైతన్య కొన్నాళ్ళు గడిపి వాళ్ళ యాస ని, అలవాట్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేసాడు. ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి, చాలా జాగ్రత్తలు తీసుకొని స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు డైరెక్టర్. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండే ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉండేవి. ఇక పాటలు సూపర్ హిట్ అయ్యాక ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పాటు అయ్యేలా చేసాయి.
దీంతో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే 12 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. నాగ చైతన్య గత రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హీరో సినిమాకి కేవలం ఒకే ఒక్క ప్రాంతం నుండి 12 కోట్ల రూపాయిల బిజినెస్ జరగడం ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చనీయాంశం అయ్యింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 43 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది సాధారణమైన విషయం కాదు. సినిమాకి టాక్ వస్తే కేవలం వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అవ్వగలదు. ఒకవేళ టాక్ రాకపోతే మాత్రం 50 శాతం కి పైగా నష్టాలు తప్పవు.
ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత అల్లు అరవింద్ కి 80 కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది. థియేట్రికల్ బిజినెస్ ఆ రేంజ్ కి అమ్ముడుపోకపోయినా, డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 60 కోట్ల రూపాయలకు పైగానే బిజినెస్ చేసింది. థియేట్రికల్ బిజినెస్ 43 కోట్లు, మొత్తం మీద 103 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. నిర్మాత అల్లు అరవింద్ కి 23 కోట్లు లాభం అన్నమాట. అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ ఏది కూడా సింగల్ పేమెంట్ తో జరగదు. ముందుగా అడ్వాన్స్ మాత్రమే ఇస్తారు, ఆ తర్వాత సినిమా ఫలితాన్ని బట్టి రేట్స్ చెప్తారు. కాబట్టి అల్లు అరవింద్ ఇంకా రిస్క్ లో ఉన్నట్టే. ‘మగధీర’, ‘బద్రీనాథ్’ చిత్రాల తర్వాత ఆయన భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ఇదే. క్రేజ్ అయితే ఆడియన్స్ లో మంచిగానే ఉంది, సినిమా ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.