Mahesh Babu
Mahesh Babu : చిన్నతనం లో మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ చెన్నై లోనే విద్యాబ్యాసం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అప్పట్లో మన సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేది కాబట్టి. మహేష్ బాబు కూడా చెన్నై లోనే చదువుకున్నాడు. కొన్నేళ్ల వరకు ఆయనకు తెలుగు భాష కంటే తమిళ భాషనే ఎక్కువ వచ్చేది. మన ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో అలా ఉండేది మహేష్ బాబుకు. స్కూల్ డేస్ లో ఆయనకు తమిళ స్టార్ హీరో సూర్య సీనియర్ గా ఉండేవాడు. వీళ్లంతా కలిసి అప్పట్లో క్రికెట్ కూడా ఆడుకునేవారట. ఇక పంజా సినిమాకి దర్శకత్వం వహించిన విష్ణు వర్ధన్ కూడా మహేష్ బాబుకు బెస్ట్ ఫ్రెండ్ అట. వీళ్లిద్దరు కలిసి చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు విష్ణు వర్ధన్. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈయన ‘ప్రేమిస్తావా’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయన మహేష్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మహేష్ బాబు, నేను స్కూల్ డేస్ లో బెంచ్ మేట్స్. ఇద్దరం కలిసి ఎన్నో చిలిపి పనులు చేసాము. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉండేది. చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చేసిన చిలిపి పనుల్లో ఒకటి నాకు బాగా గుర్తుండిపోయింది. ఆరోజుల్లో ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి అని వార్త వచ్చింది. అది నేను మహేష్ కి వెళ్లి చెప్తే, అవునా ఎక్కడ దొరుకుతున్నాయి అని అడిగాడు.ఆ తర్వాత మేమిద్దరం వెళ్లి 500 రూపాయిలు ఇచ్చి ఎగ్జామ్ పేపర్స్ కొన్నాము. ఆ తర్వాత తెలిసింది అది ఫేక్ పేపర్స్ అని. పక్క షాప్స్ లో అయినా దొరుకుతాయేమో అనుకొని అక్కడికి వెళ్లి కూడా కొన్నాము. కానీ అవన్నీ ఫేక్’ అంటూ విష్ణు వర్ధన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఒకప్పుడు అజిత్,పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియా లో బిజీ గా ఉన్న విష్ణు వర్ధన్ ఇప్పుడు అవకాశాలు లేక, కొత్త నటీనటులతో సినిమాలు చేసుకునే స్థాయికి పడిపోయాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన ‘పంజా’ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం పెద్దగా నచ్చలేదు కానీ, ఇప్పటి ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా చూసి ఎన్ని రోజులైందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు వర్ధన్ లో మంచి స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ ఉన్నాడు కానీ, సరైన స్క్రిప్ట్ ని ఎంచుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.