జూన్ 15 నుంచి సూర్యుడు నక్షత్ర మార్పు.. ఈ 5 రాశుల వారికి రాజయోగం..

సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారి జీవితంలో మార్పులు రానున్నాయి. ఈ రాశి వ్యాపారం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

Written By: Srinivas, Updated On : June 13, 2024 2:32 pm

Five Grahe horoscope

Follow us on

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మిగతా గ్రహాలతో అనుసంధానంగా ఉంటాడు. ఓ వైపు గ్రహాల కలయికతో పాటు మరో వైపు నెలకోసారి రాశులు మారుతూ ఉంటాడు. జూన్ నెలలో సూర్య సంచారంలో భాగంగా 15వ తేదీ నుంచి మిథున రాశిలో ప్రవేశించనున్నాడు. దాదాపు ఏడాది తరువాత మిథున రాశిలోకి రానుండడంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా 5 రాశుల వారి జీవితాల్లో కొన్ని మార్పులు రానున్నాయి. అవేంటంటే?

సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారి జీవితంలో మార్పులు రానున్నాయి. ఈ రాశి వ్యాపారం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహ రాశిపై సూర్యసంచారం ప్రభావం ఉండనుంది.సింహ రాశి వారికి శత్రువుల బెడత తీరనుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. విద్యార్థులు లక్ష్యాలను చేరుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది.

తులా రాశి వారికి జూన్ 15 నుంచి అన్నీ శుభాలే జరగనున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ధైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనులు జాప్యం ఉండొచ్చు. కానీ ఎలాంటి ఆందోళన ఉండదు.

సూర్యుడు రాశి మార్పు కారణంగా కన్యా రాశిపై ప్రభావం పడనుంది.దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. వ్యాపారస్తులు పురోగతి సాధిస్తారు. అనుకోని లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయకపోతే ఉల్లాసంగా ఉంటారు.